సినిమాల విషయంలో రౌడీ స్టార్ స్టాటజీ ఏంటీ?

Sun Aug 14 2022 06:00:01 GMT+0530 (IST)

What is the Strategy of Vijay Devarakonda

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటించిన భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ .లైగర్.. వెర్సటైల్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ అపూర్వ మెహతాలతో కలిసి ధర్మా ప్రొడక్షన్స్ పూరీ కనెక్ట్స్ సంయుక్తంగా ఈ మూవీని నిర్మించాయి. అనన్య పాండే హీరోయిన్ గా నటించిన ఈ మూవీలో వరల్డ్ ఫేమస్ బాక్సర్ మైఖేల్ జాక్సన్ కీలక అతిథి పాత్రలో నటించారు. రమ్యకృష్ణ తల్లి పాత్రలో నటించిన ఈ మూవీ వరల్డ్ వైడ్ గా ఆగస్టు 25న భారీ స్థాయిలో విడుదల కాబోతోంది.ఈ మూవీతో హీరో విజయ్ దేవరకొండ బాలీవుడ్ కు పరిచయం అవుతున్న విషయం తెలిసిందే. తెలుగుతో పాటు హిందీలోనూ ఏక కాలంలో ఈ మూవీని తెరకెక్కించారు.అయితే ఈ మూవీ రిలీజ్ టైమ్ దగ్గరపడుతున్న నేపథ్యంలో హీరో విజయ్ దేవరకొండ మూవీ ప్రచారాన్ని ముంబైలోనే ఎక్కువగా చేశారు. ఆ తరువాతే తన దృష్టిని దక్షిణాదితో పాటు దేశ వ్యాప్తంగా పర్యటించాలని నిర్ణయించుకున్నారు. ఫ్యాన్ డమ్ టూర్ పేరుతో ఈ మూవీ ప్రమోషన్స్ చేస్తూ దేశ వ్యాప్తంగా తిరుగుతున్నారు.

అయితే తెలుగులో కంటే హిందీలోనే ఎక్కువగా సినిమాలు చేయాలని విజయ్ అనుకుంటున్నారని ఆ కారణంగానే తెలుగులో సినిమాలు అంగీకరించడం లేదనే కామెంట్ లు వినిపిస్తున్నాయి.

దీనికి పై తాజాగా ఓ ఇంగ్లీష్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. .ప్రస్తుతం నేను ఏ సినిమాని అంగీకరించే స్థితిలో లేను. ఎందుకంటే నా దృష్టి మొత్తం ఇప్పడు లైగర్ పైనే వుంది. ఈ మూవీ రిలీజ్ కోసం సక్సెస్ ని ఎంజాయ్ చేయడం కోసం ఎదురుచూస్తున్నాను. అన్నారు.

అంతే కాకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేయాలనే హరీలో నేను లేను. .లైగర్. రిలీజ్ అయిన తరువాత కథలు విని అందులో నచ్చిన వాటిని మాత్రమే ఓకే చేయాలనుకుంటున్నాను. దీనికి కొన్ని నెలలు పడుతుంది. అని స్పష్టం చేశాడట. విజయ్ ఉన్నట్టుండి ఇలా మాట్లాడటానికి కారణం .లైగర్. అని ఈ మూవీతో తాను పాన్ ఇండియా స్థాయి సక్సెస్ ని అందుకోబోతున్నానని విజయ్ గట్టి నమ్మకంతో వున్నాడట. ఆ కారణంగానే సినిమాలు అంగీకరించడం లేదని తెలుస్తోంది.

వన్స్ సినిమా విడుదలై బిగ్ హిట్ అని రిజల్ట్ వచ్చిన తరువాతే తన తదుపరి సినిమాలపై దృష్టి పెట్టాలని విజయ్ పక్కా ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్లాలనుకుంటున్నాడని చెబుతున్నారు. అంతే విజయ్ దేవరకొండ వెయిట్ అండ్ వాచ్ ఫార్ములాతోముందుకు వెళ్లాలనుకుంటున్నాడన్నమాట. ఆ తరువాత బాలీవుడ్ లోనూ హ్యాపీగా పాగా వేయొచ్చన్నది మన రౌడీ స్టార్ ప్లాన్ గా తెలుస్తోంది.