Begin typing your search above and press return to search.

స్టార్ హీరో మాజీ భార్య‌తో ఆమె ఎఫైర్ ఏమిటో?

By:  Tupaki Desk   |   17 May 2022 3:08 AM GMT
స్టార్ హీరో మాజీ భార్య‌తో ఆమె ఎఫైర్ ఏమిటో?
X
సోనాల్ చౌహాన్ .. ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. న‌ట‌సింహా నంద‌మూరి బాల‌కృష్ణ స‌ర‌స‌న వ‌రుస చిత్రాల్లో న‌టించిన ఈ బ్యూటీ ఇటీవ‌ల బాలీవుడ్ లోనూ కెరీర్ ప‌రంగా బిజీ అవుతోంది. ఇక సోనాల్ కి ముంబై ఫిలింస‌ర్కిల్స్ లో ఉన్న ప‌రిచ‌యాలు త‌క్కువేమీ కాదు. అక్క‌డ హై ప్రొఫైల్ సెల‌బ్రిటీ వైవ్స్ గ్యాంగ్ తో త‌న‌కు సత్సంబంధాలున్నాయి.

తాజాగా తన పుట్టినరోజును గోవాలో సుస్సానే ఖాన్ స‌హా త‌న స్నేహితుల తో క‌లిసి జరుపుకుంది. సోనాల్ చౌహాన్ ఈ వేడుక‌ల్ని త‌న‌కు న‌చ్చిన రీతిలో చాలా ఘనంగా జరుపుకుంది. అంతేకాదు ఈ బ్యూటీ న‌టించిన‌ తొలి బాలీవుడ్ చిత్రం జన్నత్ విడుద‌లై 13 సంవత్సరాలు పూర్తి చేసుకుంది.

బ‌ర్త్ డే వేడుక‌ల‌తో పాటు జ‌న్న‌త్ సెల‌బ్రేష‌న్స్ ని కూడా ఇలా నైట్ పార్టీ రూపంలో చిలౌట్ చేయ‌డం హాట్ టాపిక్ గా మారింది.

గోవాలోని సహజమైన బీచ్ లలో సుసానే ఖాన్ త‌న బోయ్ ఫ్రెండ్ అర్స్లాన్ గోని స‌హా ఇత‌ర‌ సన్నిహితులతో కలిసి సోనాల్ ఈ పార్టీని ఎంతో ప్లెజెంట్ గా జ‌రుపుకున్నారు. అందమైన మెరిసే కార్సెట్ డ్రెస్ ని ధరించి సోనాల్ ఎప్పటిలాగే మిల‌మిలా మెరిసిపోయింది.

సోనాల్ స్నేహితుల బృందం ఈ పార్టీలో త‌న కోసం ఒక‌ రుచికరమైన కేక్ ని తెచ్చారు. డెజర్ట్ లలో మునిగి తేలకుండా సోనాల్ ఎంత ఫిట్ గా .. ఫ్యాబ్ గా ఉండగలుగుతోందో అర్థం చేసుకోవ‌డానికి త‌న‌లోని ఫిట్ నెస్ ఫ్రీక్ ని ప్ర‌శ్నించాలి.

సోనాల్ కెరీర్ బెస్ట్ సినిమాల‌కు సంత‌కాలు చేసింది. డార్లింగ్ ప్ర‌భాస్- సైఫ్ అలీఖాన్ వంటి టాప్ హీరోలు న‌టిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం ఆదిపురుష్ 3డిలో సోనాల్ ఒక కీల‌క పాత్ర‌ను పోషిస్తోంది. అలాగే కింగ్ నాగార్జున‌తో క‌లిసి ఘోస్ట్ చిత్రంలో ఏజెంట్ గా క‌నిపించ‌నుంది. ఈ సినిమాలతో పాటు బాలీవుడ్ లో యువ‌హీరోల స‌ర‌స‌న న‌టించేందుకు వ‌రుస‌గా సంత‌కాలు చేస్తోంద‌ని స‌మాచారం.