Begin typing your search above and press return to search.

షాహిద్ బ్లడీ డాడీ టాక్ ఏంటంటే..!

By:  Tupaki Desk   |   10 Jun 2023 12:20 PM GMT
షాహిద్ బ్లడీ డాడీ టాక్ ఏంటంటే..!
X
షాహిద్ కపూర్ లీడ్ రోల్ లో అలీ అబ్బాస్ జాఫర్ డైరెక్షన్ లో వచ్చిన సినిమా బ్లడీ డాడీ. యాక్షన్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా లేటెస్ట్ గా జియో సినిమా లో రిలీజైంది. సినిమా డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ చేయడం విశేషం. ఇక సినిమా కథ విషయానికి వస్తే నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారిగా పనిచేసే సుమేర్ ఆజాద్ (సాహిద్ కపూర్) కరోనా టైం లో డ్రగ్స్ ముఠా పై దాడి జరిపి కోట్ల విలువ చేసే కొకైన్ ని స్వాధీనం చేసుకుంటాడు.

ఆ దాడిలో ఒకడు చనిపోతాడు. దాంతో చీకటి సామ్రాజ్య అధిపతి సికిందర్ (రోనిత్ రాయ్) సుమేర్ ఆజాద్ కొడుకుని కిడ్నాప్ చేస్తాడు. డ్రగ్స్ ని విడిపిస్తేనే కానీ కొడుకుని వదిలేయనని చెబుతాడు. మరి వాళ్ల బెదిరింపులకు సుమేర్ ఆజాద్ ఆ డ్రగ్స్ తిరిగి ఇచ్చాడా..? కొడుకుని ఎలా కాపాడుకున్నాడు అన్నది సినిమా కథ.

చాలా చిన్న పాయింట్ తో బ్లడీ డాడీ సినిమా రూపొందించారని చెప్పొచ్చు. డ్రగ్స్ ముఠాపై దాడి. కిడ్నాప్, వారిని చేధించడం ఇదే సినిమాలో ఉన్నాయి. కథ చిన్నదే అయినా కొన్నిసార్లు స్క్రీన్ ప్లేతో మ్యాజిక్ చేస్తారు. కానీ బ్లడీ డాడీ విషయంలో అది జరగలేదు.

యాక్షన్ డైరెక్టర్ గా ఇదివరకు సుల్తాన్, టైగర్ జిందగి హై, భారత్ సినిమాలు తీసిన డైరెక్టర్ అలీ అబ్బాస్ జాఫర్ ఈ సినిమాను తన స్టైల్ లో తెరకెక్కించడంలో విఫలమయ్యాడు. కథ కథనాలు ఇంకాస్త గ్రిప్పింగ్ గా ఉంటే బాగుండేదని అనిపిస్తుంది. ఇక సినిమాలో చాలా చోట్ల ఎమోషనల్ డ్రా బ్యాక్ గా అనిపిస్తుంది. ఆ విషయంలో కూడా దర్శకుడు జాగ్రత్త వహిస్తే బాగుండేది.

కబీర్ సింగ్ తో సూపర్ హిట్ అందుకున్న షాహిద్ కపూర్ జెర్సీతో కూడా మెప్పించాడు. అయితే బ్లడీ డాడీ మాత్రం ఆడియన్స్ ని నిరాశ పరిచింది. సినిమా ఎక్కడ ఆడియన్స్ ని ఎంగేజ్ చేయలేదని చెప్పొచ్చు. సినిమా చూసిన వారంతా కూడా ఇది ఓటీటీ రిలీజ్ చేసి మంచి పని చేశారని అంటున్నారు.

జియో సినిమాలో ఫ్రీగా చూస్తేనే సినిమాపై ఈ రియాక్షన్ వచ్చింది అంటే థియేట్రికల్ రిలీజ్ చేసి ఉంటే మరో డిజాస్టర్ అయ్యుండేది. అసలే బాలీవుడ్ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర వెల వెలబోతున్న ఈ టైం లో బ్లడీ డాడీ సినిమా థియేట్రికల్ రిలీజ్ స్కిప్ చేయడం మంచి నిర్ణయమని తెలుస్తుంది.

సినిమా ఎంత భారీగా తీశామన్నది కాదు అది ఆడియన్ కి ఎంత దగ్గర చేస్తున్నాం అన్న విషయంలో బాలీవుడ్ మేకర్స్ వరుస తప్పులు చేస్తున్నారు. ఈ క్రమంలోనే బ్లడీ డాడీ విషయంలో కూడా అదే జరిగింది. రొటీన్ కథ అంతే రొటీన్ స్క్రీన్ ప్లేతో ఈ సినిమా వచ్చింది. అందుకే సినిమా చూసిన ఆడియన్స్ పెదవి విరుస్తున్నారు.