పూరి తదుపరి ప్రాజెక్ట్ ఏంటీ.. అక్కడ ఇదే చర్చ

Wed Sep 28 2022 23:00:01 GMT+0530 (India Standard Time)

What is Puri next project

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కెరీర్ లో కష్టాలు ఎదుర్కొంటున్నారు. వరుస ఫ్లాప్ లకు ఇస్మార్ట్ శంకర్ సినిమా తో బ్రేక్ వేసినట్లే అని.. ఇక నుండి వరుసగా సక్సెస్ లు వస్తాయని పూరి అభిమానులు ఆనందిస్తున్న సమయంలోనే లైగర్ సినిమా మరో దారుణమైన దెబ్బను పూరి జగన్నాధ్ కు తగిలేలా చేసింది. పూరి ఇప్పుడు డీప్ ట్రబుల్స్ లో ఉన్నాడు అనేది ఇండస్ట్రీ వర్గాల టాక్.ఇప్పటికే కమిట్ అయిన రెండు మూడు సినిమాలు క్యాన్సిల్ అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. హీరోలు తనపై నమ్మకంతో డేట్లు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నా కూడా నిర్మాతలు వచ్చే పరిస్థితి లేదని... ఒక వేళ తానే స్వయంగా నిర్మించాలన్నా కూడా అందుకు ప్రస్తుత పరిస్థితులు అనుకూలించే అవకాశం లేదని టాక్ నడుస్తోంది.

ప్రస్తుతం ఇండస్ట్రీలో చాలా మంది లైగర్ తర్వాత పూరి జగన్నాధ్ చేయబోతున్న సినిమా ఏంటీ.. అసలు ఆయన నుండి మరో సినిమా ఆశించవచ్చా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో పూరి అభిమానులు కూడా విభిన్నంగా స్పందిస్తున్నారు. ఒక ఇడియట్ తరహా సినిమాను పూరి తీస్తే బాగుంటుందని ఆశ పడుతున్నారు.

ప్రస్తుత ప్రేక్షకుల అభిరుచి కి అనుగుణంగా సినిమాను తీస్తే బాగుంటుందని కొందరు పూరికి ఉచిత సలహాలు ఇస్తున్నారు. మొత్తానికి ఫ్లాప్ పడ్డ సమయంలో చాలా దారుణమైన పరిస్థితులు ఉంటాయని ఫిల్మ్ మేకర్స్ అంటూ ఉంటారు. అది ఇప్పుడు పూరికి కూడా తప్పడం లేదు. ఆ మధ్య తనయుడు ఆకాష్ తో పూరి ఒక సినిమా ప్లాన్ చేస్తాడట అంటూ వార్తలు వచ్చాయి. మరి అది ఎంత వరకు నిజమో తెలియాల్సి ఉంది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.