Begin typing your search above and press return to search.

కాజోల్ కి అసలేమైంది?

By:  Tupaki Desk   |   10 Jun 2023 8:00 AM GMT
కాజోల్ కి అసలేమైంది?
X
సెలబ్రిటీలు నిత్యం వారి అభిమాను లతో టచ్ లో ఉండేందు కు ఇన్ స్టాగ్రామ్, ట్విట్టర్ ఒక వేదికగా ప్రస్తుతం మారిన సంగతి తెలిసిందే. ఈ సోషల్ మీడియా వేదికల ద్వారా సెలబ్రిటీ లని ఫాలో కావడం తో పాటు వారికి సంబందించిన అప్డేట్స్ ని తెలుసుకునే అవకాశం ఉంటుంది. అయితే సోషల్ మీడియా కారణంగా సెలబ్రిటీలు కొన్ని సార్లు మానసిక ఆందోళన కి కూడా గురవుతూ ఉంటారు.

దీనికి కారణం ఇన్ స్టాగ్రామ్ లలో ముఖ్యంగా అందాల భామల ని ఫాలో అయ్యే వారి లో అభిమానులు ఉంటారు. అలాగే వారి అందాల ని ఆశ్వాదించాలని అనుకునేవారు కూడా ఉంటారు. అయితే సోషల్ మీడియా వేధింపుల కారణంగా కొన్నిసార్లు సెలబ్రిటీలు వాటికి దూరం అవుతూ ఉంటారు. తాజాగా బాలీవుడ్ వెటరన్ స్టార్ హీరోయిన్ కాజోల్ కూడా అలాగే ఇప్పుడు ఇన్ స్టాగ్రామ్ కి దూరం అయ్యారు.

ఆమె నిత్యం ఇన్ స్టాగ్రామ్ లో యాక్టివ్ గా ఉంటూ తనకి సంబందించిన విశేషా లని ఫ్యాన్స్ తో పంచుకుంటూ ఉంటారు. అయితే సడెన్ గా ఏమైందో ఏమో ఆనే ఇన్ స్టాగ్రామ్ కి వీడుతున్నట్లు ప్రకటించారు. ట్విట్టర్ లో ఒక పోస్ట్ పెట్టి అభిమానులు అందరికి క్షమాపణలు చెప్పారు. ప్రస్తుతం చాలా ఒత్తిడి లో ఉన్నానని అందుకే కొంతకాలం పాటు సోషల్ మీడియా కి దూరంగా ఉండాలని డిసైడ్ అయినట్లు కాజోల్ పేర్కొన్నారు.

తరువాత తన ఓల్డ్ పోస్ట్స్, ఫోటోలు అన్ని కూడా డిలేట్ చేసి ప్రొఫైల్ కూడా డీయాక్టివేట్ చేశారు. ఉన్నపళం గా కాజోల్ ఇలా ఇన్ స్టాగ్రామ్ నుంచి వైదొలగడం, దాని కి కారణంగా ఒత్తిడి లో ఉన్నాననే విషయాన్ని చెప్పడం తో ఆమె అభిమానులు టెన్సన్ పడుతున్నారు. అసలు కాజోల్ కి ఏమైంది తెలుసుకో వాలని ప్రయత్నం చేస్తున్నారు.

అలాగే కొంతమంది ఫ్యాన్స్ ట్విట్టర్ లో ఆమెకి ధైర్యం చెబుతూ పోస్టులు పెడుతున్నారు. వర్రీ అవ్వొద్దని, ఎక్కువ రోజులు టెన్సన్ లు ఉండవు అంటూ నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. ప్రస్తుతం కాజోల్ ఇంపార్టెంట్ రోల్ లో నటించిన లస్ట్ స్టోరీస్ 2 ఈ నెల ఆఖరున ప్రేక్షకుల ముందుకి రాబోతోంది.