Begin typing your search above and press return to search.

ఏప్రిల్ 28 ఏం జరిగింది.. థ్రిల్లింగ్ గా ఉంది: హీరో నిఖిల్

By:  Tupaki Desk   |   23 Feb 2021 11:30 PM GMT
ఏప్రిల్ 28 ఏం జరిగింది.. థ్రిల్లింగ్ గా ఉంది: హీరో నిఖిల్
X
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈమధ్య కొత్త సినిమాలు బాగానే రిలీజ్ అవుతున్నాయి. అందులో ఒకటి 'ఏప్రిల్ 28 ఏం జరిగింది'. యువహీరో రంజిత్‌, షెర్రీ అగర్వాల్ నాయకనాయికలుగా తెరకెక్కిన ఈ సినిమాను వీజీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ పై వీరాస్వామి.జి స్వీయనిర్మాణంలో తెరకెక్కించారు. ఫిబ్రవరి 27న ఈ చిత్రం విడుదల కాబోతుండటంతో చిత్రబృందం తాజాగా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించింది.

ఈ కార్యక్రమానికి అతిథులుగా హీరో నిఖిల్, బిగ్‌బాస్-4 ఫేమ్ సయ్యద్ సొహెల్ హాజరయ్యారు. ప్రీరిలీజ్ ముందే సినిమా చూసిన హీరో నిఖిల్ మాట్లాడుతూ.. పెద్దసినిమా, చిన్నసినిమా అనేవి నేను నమ్మను. సినిమా బడ్జెట్ ఎంత, అందులో ఎవరూ నటించారనే దానికంటే.. సినిమా అందించే ఎక్స్పీరియన్స్ ముఖ్యం. ఎక్స్పీరియన్స్ పరంగా ఈ సినిమా చాలా బాగుంది. ఎలాంటి అంచనాలు లేకుండా సినిమా చూశా. హీరో రంజిత్ నాకు మంచి స్నేహితుడు.

యువత, అంకిత్ పల్లవి అండ్ ఫ్రెండ్స్ సమయంలో ఆ సినిమాల్ని జనాల్లోకి తీసుకెళ్లడానికి పడిన బాధ, తపన అవన్నీ ఇప్పుడు రంజిత్‌లో కనిపిస్తున్నాయి. మంచి పాయింట్‌ను ఎంచుకొని ఈ సినిమా చేశారు. ఆద్యంతం ఊహకందని మలుపులతో థ్రిల్‌ను పంచుతుంది. మంచి సినిమాను జనాల్లోకి తీసుకెళ్లడం బాధ్యతగా భావించి ఈ సినిమాను ప్రోత్సహించడానికి ముందుకొచ్చా" అని అన్నాడు.

బిగ్‌ బాస్ ఫేమ్ సయ్యద్ సొహెల్ మాట్లాడుతూ.. బిగ్‌బాస్ నుంచి వచ్చిన తర్వాత నేను చూసిన ఫస్ట్ సినిమా ఇది. నాకు చాలా బాగా నచ్చింది. అశ్లీలత, ద్వంద్వర్థాలకు తావు లేకుండా కుటుంబమంతా కలిసి చూసేలా ఉంటుంది. రంజిత్ అద్భుతమైన నటనను కనబరిచాడు. వీరాస్వామి వినూత్నమైన పాయింట్‌తో సినిమాను తెరకెక్కించారు. హరిప్రసాద్ స్క్రీన్‌ప్లే ఉత్కంఠను పంచుతుంది. బోర్ లేకుండా ఆద్యంతం ఈ సినిమా థ్రిల్‌ను కలిగిస్తుందని చెప్పాడు. వీరితో పాటు చిత్రబృందం కూడా మాట్లాడారు. డాన్స్ మాస్టర్ గా సక్సెస్ అయిన వీరాస్వామి డైరెక్టర్ గా కూడా సక్సెస్ అవుతాడని నమ్మకం వ్యక్తం చేశారు.