రిషికేష్ టూర్ ముందు సామ్-చై మధ్య ఏం జరిగింది!

Thu Oct 21 2021 05:00:01 GMT+0530 (IST)

What happened between Sam chai before the Rishikesh Tour

నాగ చైతన్య-సమంత విడిపోయారు అన్నది ఇప్పుడు అధికారికం. కానీ ఇద్దరి మధ్య దూరం   మొదలైన నాటి నుంచి సమంత-నాగ చైతన్యలని మీడియా చాలా క్లోజ్ గా వాచ్ చేసింది. దానికి తగ్గట్టు సమంత చేసిన కొన్ని పోస్టులు.. ప్రశాంతత కోసం సమంత హైదరాబాద్ ని వదిలి ఇతర  వెకేషన్ ప్లేస్ ల్లో స్నేహితులుతో గడపండం వంటి సన్నివేశాలతో ఇద్దరి మధ్య దూరంగా పెరిగిందనే  అంచనాకి మీడియా వచ్చేసింది. ఊహాగానాల్ని ఆధారం చేసుకునే బోలెడన్ని మీడియా కథనాలు వైరల్ అయ్యాయి. తాజాగా సమంత చైతో విడిపోయే కొన్ని వారాల ముందు రిషికేష్ టూర్ వెళ్లినట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.రిషికేషి టూర్ కి  సంబంధించిన  కొన్ని ఫోటోల్ని సమంత ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేయడంతోనే విషయం బయటకి పొక్కింది. అక్కడ ఓ లగ్జరీ హోటల్ లో దిగినట్లు  తెలుస్తోంది. ఒక రాత్రికి ఆ హోటల్ లో బస చేయాలంటే 38000 ఖర్చుఅవుతుంది. అయితే డిస్కౌంట్ ఆఫర్ ఉండటంతో 27000 రూపాయలకే రూమ్ దొరికినట్లు ఓ బాలీవుడ్  పోర్టల్  ద్వారా తెలుస్తోంది. ఇద్దరు అండర్ స్టాండింగ్ మీద విడిపోదామని ఓ నిర్ణయానికి వచ్చేసిన తర్వాతనే సమంత ప్రశాంతత కోసం రిషికేష్ టూర్ వెళ్లినట్లు తెలుస్తోంది. అక్కడ అందమైన కొండలు..సెలయేర్లు..ఆథ్యాధ్మిక మందిరాలకు సంబంధించిన ఫోటోల్ని పోస్ట్ చేసింది.

వాటిని బట్టే సమంత గుండెల్లో మోస్తోన్న  భారాన్ని దించుకోవడానికి రిషికేష్ వెళ్లిందని తెలుస్తోంది. ఇక చై అయితే ఇప్పటివరకూ ఎలాంటి  కామెంట్ చేయలేదు. ఏ మీడియాని వేదికగా చేసుకుని ప్రత్యక్షంగా గానీ..పరోక్షంగా గానీ  నిజా నిజాలు బయట పెట్టే ప్రయత్నం చేయలేదు.  విడాకుల విషయం కూడా సమంత పోస్టుల ద్వారానీ మీడియా పసిగట్టింది. లేదంటే అసలు విషయమే బయటకి వచ్చేది కాదు.