Begin typing your search above and press return to search.

నీహారిక - చైతన్య.. అసలేమైంది?

By:  Tupaki Desk   |   20 March 2023 11:00 AM GMT
నీహారిక - చైతన్య.. అసలేమైంది?
X
మెగా డాటర్, నటి నిహారిక గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కొణిదెల నాగబాబు కూతురిగా, చిరంజీవి, పవన్ కల్యాణ్ ల సోదరుడి కూతురిగా.. మెగా డాటర్ గా మంచి పేరునే సంపాదించుకుంది. ముందుగా టీవీలో యాంకర్ గా కెరియర్ ప్రారంభించిన ఈమె ఆ తర్వాత సినిమాల్లో, వెబ్ సిరీస్ లలో నటించి మెప్పించింది. ఒక మనసు చిత్రంతో సినిమాల్లోకి వచ్చిన ఈమె ఆ తర్వాత పలు సినిమాల్లో నటించి మెప్పించింది. 2020 డిసెంబర్ 9వ తేదీన జొన్నలగడ్డ చైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకుందీ ముద్దుగుమ్మ.

వీరిపెళ్లి అంగరంగ వైభవంగా జరగ్గా.. చూడముచ్చటైన జంటగా పేరు తెచ్చుకున్నారు చైతన్య, నిహారిక. అయితే వీరికి పెళ్లి అయిన ఏడాదిన్నర తర్వాత నుంచే వీరిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. కానీ వాటన్నిటినీ కొట్టేశాలా.. చైతన్య ఓ పోస్ట్ పెట్టాడు. తాను, నిహారిక కలిసి ఉన్న ఫొటో పెట్టి తామిద్దరి మధ్య ఎలాంటి గొడవలు లేవని క్లారిటీ ఇచ్చాడు. కానీ ఇప్పుడు మరోసారి వవీరి విడాకుల వార్తలు ఊపందుకున్నాయి. అందుకూ ఓ కారణం ఉంది.

నిహారిక గత కొద్ది నెలలుగా ఇన్ స్టాగ్రామ్ లో యాక్టివ్ గా లేరు. ఆమె చివరగా గతేడాది డిసెంబర్ లో ఓ వీడియోను పోస్ట్ చేశారు. ఇక చైతన్య ఈ ఏడాది ఫిబ్రవరిలో ఓ ఫొటోను పోస్ట్ చేశారు. ఈ క్రమంలోనే వీరిద్దరూ ఇన్ స్టా వేదికగా ఒకరినొకరు అన్ ఫాలో చేశారు.

ముఖ్యంగా చైతన్య పెళ్లికి సంబంధించిన, తామిద్దరికి సంబంధించిన ఫొటోలను డిలీట్ చేశారు. దీంతో వీరిద్దరూ విడిపోతున్నారంటూ, విడాకులు తీసుకోబోతున్నరాంటూ వార్తలు వస్తున్నాయి. సమంత, నాగ చైతన్య విషయంలో కూడా ఇలాగే జరిగింది. విడాకులకు ముందు సామ్ ఇలాగే వారిద్దరి ఫొటోలను డిలీట్ చేసింది.

అయితే నిశ్చయ్ జంట ఒకరినొకరు అన్ ఫాలో అవడం, చైనత్య ఫొటోలు డిలీట్ చేయడంతో.. విడాకులు కన్ఫార్మ్ అంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. మరోవైపు నిహారిక మాత్రం తమ పెళ్లి, చైతన్యతో కలిసి ఉన్న ఫొటోలను ఇన్ స్టానుంచి డిలీట్ చేయలేదు.

ఈ వార్తలపై అటు మెగా ఫ్యామిలీ కానీ చైతన్య కానీ స్పందించలేదు. కానీ విషయం తెలుసుకున్న పలువురు నెటిజెన్లు మాత్రం మెగా డాటర్లకు పెళ్లి అచ్చిరాలేదంటూ కామెంట్లు చేస్తున్నారు. మరికొందరేమో.. చైతన్యకు, నిహారికకు పర్సనల్ గా మెసేజ్ లు పెడ్తూ.. నేరుగా మీరు విడాకులు తీసుకోబోతున్నారా అంటూ అడిగేస్తున్నారు. మరి చూడాలి ఏం జరగనుందో.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.