సీనియర్ భామలంతా సైడ్ అయినట్లే!

Mon Mar 20 2023 16:03:15 GMT+0530 (India Standard Time)

What about Senior Actress Career?

టాలీవుడ్ సీనియర్ భామలంతా సైడ్ అయిపోయినట్లేనా? ఇకపై   వాళ్ల స్థానాల్ని కొత్త నాయికలు భర్తీ చేయడమేనా? అంటే అవుననే తెలుస్తుంది. ఇప్పటికే సమంత...రష్మిక బాలీవుడ్ లో బిజీ అయిపో తున్నారు. సామ్ వెబ్ సిరీస్ లు కూడా చేస్తుంది. దీంతో భవిష్యత్ ని అక్కడే ప్లాన్ చేసుకుంటుంది. అలాగే నేషనల్ క్రష్ బ్యూటీ రష్మిక మందన్న కూడా బాలీవుడ్ పైనే ఫోకస్ పెట్టి పనిచేస్తుంది.



తెలుగులో బిజీ అయిన తర్వాత కన్నడ పరిశ్రమ వైపు చూసింది లేదు. ఈ కోణంలో రష్మిక సొంత పరిశ్రమ నుంచి ఎలాంటి విమర్శలు  ఎదుర్కుందో తెలిసిందే. ప్రస్తుతం హిందీ సినిమాలు చేస్తోన్న నేపథ్యంలో తెలుగులో కమిట్ మెంట్లు షూరూ చేయడం కష్టమే అన్న టాక్ వినిపిస్తుంది. ఇక స్వీటీ అనుష్కకి అవకాశాలు రావడం లేదని తెలుస్తుంది. దానికి తోడు అనుష్క బాగా బొద్దెక్కడం వంటి కారణాలతో మేకర్స్ అమ్మడివైపు చూసే అవకాశం కనిపించలేదంటున్నారు.

ఇంకాస్త సీనియర్  అయిన నయనతార ఇప్పుడిప్పుడే లేడీ ఓరియేంటెడ్ సినిమాల్లో సత్తా చాటుతుంది. తెలుగు లో అవకాశాలు వచ్చినా కమిట్ అవ్వడం చాలా రేర్ గా జరుగుతోంది. ఇక కీర్తి సురేష్ లాంటి వాళ్లు ఉన్నా? ఉపయోగం  లేదు అన్నట్లే ఉంది సన్నివేశం. పరిశ్రమకి వచ్చి సంవత్సరాలు గడుస్తున్నా? అమ్మడి కెరీర్ పరంగా ఏమాత్రం గ్రోత్ లేదు. ఆమెకంటే వెనుకొచ్చిన భామలు ముందుకెళ్తున్నారు.

దీంతో టాలీవుడ్ లో  కుర్ర భామల హవా షురూ అయినట్లేనన్న ప్రచారం మొదలైంది. యువ భామ శ్రీలీల క్రేజ్ యువతలో ఏ రేంజ్ లో ఉందో ?  చెప్పాల్సిన పనిలేదు. తనదైన చలాకీతనంతో కుర్రాళ్లను ఆకట్టుకుంటూ దూసుకుపోతుంది. అందం..అభినయం..ప్రతిభ అదనంగా కలిసొస్తున్నాయి. ప్రస్తుతం ఈ భామతో నటించడానికి యంగ్ హీరోల నుంచి సీనియర్ హీరో లవరకూ అంతా ఆసక్తి చూపిస్తున్నారు.

అలాగే  'సీతారామం'తో  ఫేమస్ అయిన ముంబై బ్యూటీ మృణాల్ ఠాకూర్ నాని 30లో నటిసంది. రెండవ సినిమాకే ఏకంగా 3 కోట్లు పారితోషికం తీసుకుంటుందంటే? ఆమె క్రేజ్ ఎలా ఉందో అర్ధమవుతుంది. ఇక  కియారా అద్వాణీ కూడా రేసులో దూసుకుపోతుంది. పాన్ ఇండియా చిత్రం  ఆర్సీ 15లో నటిస్తూ అందర్ని ఆకర్షిస్తుంది.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ 30వ సినిమాతో జాన్వీకపూర్ కూడా లాంచ్ అవుతుంది. అలియాభట్ ఒకే చెప్పాలి గానీ..అవకాశాలు క్యూలో ఉన్నాయి. కృతిశెట్టి...మాళవికా నాయర్.. సంయుక్త మీనన్ లాంటి భామలు టైర్-2 హీరోలు టార్గెట్ గా అవకాశాలు అందుకుంటున్నారు. వీళ్లు టైర్ -1 హీరోలకు ప్రమోట్ అవ్వడానికి ఎంతో సమయం పట్టదు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.