ఆలియా మొదటి రాత్రిలో ఇది ఊహించని ట్విస్ట్!

Wed Jul 06 2022 09:25:55 GMT+0530 (IST)

What about Alia's first night?

నవవధూవరులు మొదటి రాత్రి గురించి కలలు కనడం చాలా సహజం.  బ్రహ్మచర్యం విడిచి భాగస్వామితో మమేకం అయ్యే సందర్భమిది. తనువులు దోబూచులాడే సీజన్ కూడా ఇది. అయితే అలాంటి ముఖ్యమైన ఆ ఘట్టం గురించి ఆలియా షాకింగ్ కామెంట్ చేసింది. అసలు మొదటి రాత్రి అన్నది జరిగిందా లేదా? అన్నదానికి ఈ ప్రోమోలో జవాబు షాకిచ్చింది.



కాఫీ విత్ కరణ్ ప్రకంపనాలు ఈసారి ఓటీటీలో మొదలయ్యాయి. సీజన్ 7 సరికొత్త ట్రెండ్ క్రియేట్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. కాఫీ విత్ కరణ్ సీజన్ 7 వరుస ట్రైలర్లలో రకరకాల అంశాలు ఆసక్తిని పెంచుతున్నాయి. మరో రెండు రోజుల్లో కాఫీ విత్ కరణ్ సీజన్ 7 మొదటి ఎపిసోడ్ విడుదల అవుతుంది. తాజా ప్రోమోలో అలియాను పెళ్లి అనంతర వ్యవహారాలపై ప్రశ్నించారు.

"చాలా అలసిపోయినందున సుహాగ్రాత్ (మొదటి రాత్రి) లాంటిది ఏమీ లేదు" అని అలియా క్విక్ గా సమాధానం చెప్పింది. ఇది వేడి పెంచే సమాధానం. అలియా-రణబీర్ కపూర్ ల 'మొదటి రాత్రి' అనుభవం గురించి ఇదే వేదికపై చెప్పాలా? ఆమెను ఇలా చెప్పేలా చేసింది ఎవరు? అంటూ ఆశ్చర్యపోవాల్సిందే. ఇక ప్రోమోలో రణవీర్ ఎనర్జీ.. ఆలియా ఛమక్కులు ఆకర్షించాయి. అయితే వివాహాలు.. సంబంధాలు .. సెక్స్ లాంటి అంశాలను టచ్ చేస్తూ టీఆర్పీల కోసం పాకులాడుతున్నారన్నది ఇట్టే అర్థమవుతోంది.  పూర్తి ఎపిసోడ్ విడుదలయ్యాక నెటిజనుల నుంచి ఆలియాకు తన గురువు కరణ్ జోహార్ కు కౌంటర్లు పడిపోవడం ఖాయంగానే కనిపిస్తోంది.

ఈ వేదికపై కనిపించిన రణవీర్- ఆలియా జంట 'రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ'.. 'గల్లీ బోయ్స్' లాంటి హిట్ చిత్రాల్లో జంటగా నటించారు. రణవీర్ సింగ్- ఆలియా మళ్లీ ఇప్పుడు కాఫీ విత్ కరణ్ 7లో మొదటి అతిథులుగా విచ్చేసారు. కరణ్ జోహార్ వారిని "ఇద్దరు సంతోషంగా వివాహం చేసుకున్న వ్యక్తులు.. కానీ ఒకరికొకరు కాదు" అంటూ ఫన్ నోట్ తో ప్రేక్షకులకు పరిచయం చేశారు. రణవీర్ సింగ్ భార్య దీపికా పదుకొనే.. అలియా భట్ భర్త రణబీర్ కపూర్ ఒకరితో ఒకరు కలిసి ఈ సంవత్సరం కాఫీ విత్ కరణ్ 7 లో కనిపిస్తారేమో చూడాలన్న ఎగ్జయిట్ మెంట్ ఆడియెన్ లో కలిగింది. ప్రస్తుతానికి ఆలియా- రణవీర్ ల షోని వీక్షించే అవకాశం అందరికీ ఉంది.

ఇదే ట్రైలర్ లో అలియా భట్ తన 'గల్లీ బాయ్' సహనటుడు రణ్ వీర్ ను 'సఖి' (స్నేహితుడు) అని  తెలిపింది. రణ్ వీర్ సింగ్ విచిత్రంగా ఉన్నప్పటికీ సూపర్ ఎంటర్ టైనింగ్ గా ఈ వేదికపై కనిపించాడు. అలియా భట్ ని ఎవరితో "ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీ" బాగా పండిందని అడిగారు - ప్రశ్నలో ఉన్న ఎంపికలు .. రణ్ వీర్ సింగ్ - వరుణ్ ధావన్. దీనిపై ఆలియా స్పందన ఏమిటన్నది ట్రైలర్ లో వెల్లడి కాలేదు.

రణబీర్ కపూర్ ను (ప్రస్తుతం ఆమె భర్త) పెళ్లి చేసుకోవాలనుకుంటున్నట్లు చాలా సీజన్ ల క్రితం షోలో ఒప్పుకున్న అలియా భట్ ను "మీరు పెళ్లి చేసుకున్న వెంటనే పెళ్లి గురించి ఒక అపోహ ఏదైనా ఉందా?" అని అడిగారు. అలియా  వెంటనే ప్రత్యుత్తరం ఇచ్చింది. "సుహాగ్ రాత్ (మొదటిరాత్రి) లాంటిదేమీ లేదు. మీరు ఇప్పుడే అలసిపోయారు" అని అంది.

అలియా భట్ తన పెళ్లి గురించి 30 సెకన్ల పాటు మాట్లాడమని అడిగినప్పుడు .. ఆ ప్రశ్నను తప్పుగా అర్థం చేసుకున్న అలియా.. కరణ్ జోహార్ పెళ్లి గురించి (అది జరిగితే) మాట్లాడాలని భావించింది. వెంటనే కరణ్ జోహార్ జోక్యం చేసుకున్నారు. ఆ తర్వాత ఆలియా పగలబడి నవ్వింది. మొత్తానికి షోని జనరంజకంగా తీర్చిదిద్దారు ఈ ఎపిసోడ్ లో.

కరణ్ S7 మొదటి ఎపిసోడ్‌ను జూలై 7న Disney+Hotstarలో మాత్రమే చూడండి. అంటూ #HotstarSpecials ..#KoffeeWithKaranOnHotstar అనే హ్యాష్ ట్యాగ్ లను కరణ్ జోడించాడు.