ప్రభాస్ అభిమానులకు 7.11 ఏఎం షాక్ ఏమిటో!

Tue Apr 20 2021 21:25:47 GMT+0530 (IST)

What a 7.11 AM shock for Prabhas fans!

డార్లింగ్ ప్రభాస్ ఓవైపు సలార్ షూటింగ్ చేస్తూనే మరోవైపు ఆదిపురుష్ 3డి చిత్రీకరణను వేగంగా పూర్తి చేస్తున్న సంగతి తెలిసిందే. ఆదిపురుష్ 3డి షూటింగ్ కి సెకండ్ వేవ్ వల్ల బ్రేక్ పడిన సంగతి తెలిసిందే. ఇటీవల కొంతకాలంగా ముంబైలో షూటింగులు సాగుతున్నా.. కోవిడ్ వేవ్ ఇబ్బందికరంగా మారింది.తాజా ఇంటర్వ్యూలో దర్శకుడు ఓంరౌత్ 30శాతం షూటింగ్ పూర్తయిందని తెలిపారు. ఇది చాలా తక్కువ షూటింగ్ అని భావించినా కొన్ని ఊహించని కాంప్లికేషన్లు అతడికి ఉన్నాయి. ఆదిపురుష్ ఒక పౌరాణిక చిత్రం కనుక చాలా వరకూ యాక్షన్ పార్ట్ దాంతో పాటే  విఎఫ్.ఎక్స్ పనులు ఉంటాయి. ఇంకా చాలా కాలం పాటు షూటింగ్ చేయాల్సి ఉంటుంది. ఇంత తక్కువ వ్యవధిలో ఆమాత్రం పూర్తయినా అది ఆశ్చర్యం కలిగించేదే.

ఇక ఆన్ లొకేషన్ ప్రభాస్ - సైఫ్ అలీఖాన్ ఒకరితో ఒకరు పోటీపడుతూ ఎవరికి వారు పాత్రలోకి పరకాయం చేసేందుకు ఎంతగా హార్డ్ వర్క్ చేస్తున్నారో కూడా ఓంరౌత్ వెల్లడించారు. తమ పాత్రల రూపురేఖల కోసం ప్రభాస్.. సైఫ్ ఆన్ లొకేషన్ చాలా వర్క్ చేస్తున్నారని కూడా తెలిపారు. ఇకపోతే ఆదిపురుష్ కి సంబంధించిన ట్రీట్ కి సమయమాసన్నమైందన్నది తాజా అప్ డేట్.

ఏప్రిల్ 21 న అంటే రేపు ఉదయం 7:11 గంటలకు ఆశ్చర్యాన్ని కలిగించే ఒక విషయాన్ని ప్రకటించనున్నట్లు ఆదిపురుష్ బృందం ప్రకటించింది. ఈ పాన్ ఇండియా చిత్రం 2022 ఆగస్టు 22 న విడుదల కావాల్సి ఉండగా..ఈ ప్రకటన ఆశ్చర్యపరుస్తోంది. రిలీజ్ తేదీకి కట్టుబడి త్వరత్వరగా పనులు ముగించాలని ఓంరౌత్ ప్లాన్ చేస్తున్నారు. కానీ సెకండ్ వేవ్ ఇబ్బంది పెడుతోంది. ఇక రేపు ప్రభాస్ అభిమానులకు ఇవ్వబోయే సర్ ప్రైజ్ ఏమిటన్నది వేచి చూడాలి.