Begin typing your search above and press return to search.

లవ్ ఫెయిల్యూర్ బాధ తగ్గడానికి ఈ నటుడు ఏం చేశాడో తెలుసా..?

By:  Tupaki Desk   |   25 Nov 2021 4:30 PM GMT
లవ్ ఫెయిల్యూర్ బాధ తగ్గడానికి ఈ నటుడు ఏం చేశాడో తెలుసా..?
X
జీవితంలో ప్రతి ఒక్కరు మానసిక వేదనకు గురవుతారు. ఆ బాధ నుంచి బయటపడడానికి కొన్న వ్యసనాలకు అలవాటుపడుతారు. అయితే కొన్ని వ్యసనాలు ఆరోగ్యానికి హాని చేసినా ఆ తరువాత బాధ తగ్గాక వాటిని మానేయడానికి ట్రై చేస్తారు. అయితే ఓ హాలీవుడ్ నటుడు తన జీవితంలో జరిగిన సంఘటనను మరిచిపోవడానికి విచ్చలవిడిగా శృంగారానికి అలవాటు పడ్డాడు. తనకు పరిచయమైన ప్రతీ అమ్మాయితో రాసలీలలు జరుపుతూ ఎంజాయ్ చేశాడు. అయితే ఇదంతా కేవలం తన మానసిక బాధను పొగొట్టడానికే అని ఆ నటుడు చెబెతున్నాడు. ఇంతకీ ఆ నటుడు ఎవరో తెలుసుకోవాలని ఉందా..?

విల్ స్మిత్.. ఈ పేరు ఇక్కడి వారికి తెలియకపోయినా హాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితుడే. ఈయన తన జీవితంలోజరిగిన ఓ సంఘటన గురించి ఓ పుస్తకమే రాశాడు. తాను 16 ఏళ్లకే ఓ అమ్మాయితో ప్రేమలో పడ్డాడట. ఆమె పేరు మొనాలి. పీకల్లోతు ప్రేమలో పడ్డ వీరిద్దరు కొంతకాలం తరువాత విడిపోయారు. కారణాలు ఏవైనా కొంతమంది ప్రేమికుల మధ్య జరిగేదిదే. అయితే విల్ స్మిత్ తన ప్రేయసితో బ్రేకప్ కావడాన్ని తట్టుకోలేకపోయాడు. తీవ్ర మానసిక వేదనను పొందాడు. దీంతో ఆయన ఏం చేశాడో తన పుస్తకంలో వివరించాడు.

విల్ స్మిత్ తన బాధను మరిచిపోవడానికి ఓ వ్యసనాన్ని అలవాటు చేసుకున్నాడు. సాధారణంగా ఇలాంటి పరిస్థితి ఎదురైనప్పడు బాధను మరిచిపోవడానికి కొంతమంది ఆల్కహాల్ తీసుకుంటారు. కానీ విల్ స్మిత్ మాత్రం ఇతర అమ్మాయిలతో వివాహేతర సంబంధం పెట్టుకుంటూ వారితో శృంగారం చేస్తూ వచ్చాడు. అయితే తాను చేస్తున్నది తప్పే అయినా మానసిక బాధను పొగొట్టుకోవడానికి తప్పలేదంటాడు. అయితే తాను అమ్మయితో సెక్స్ చేసిన ప్రతీ సారి భావప్రాప్తి కలిగే సమయంలో ఊపిరాడలేదట. అంతేకాకుండా ఒక్కోసారి వాంతికూడా చేసుకునేవాడట.

ఇక తాను ప్రేమించిన మొనాలి వేరే వ్యక్తితో కలిసి జీవిస్తోంది. మొనాలిని మరిచిపోకుండా విల్ స్మిత్ ఎంచుకున్న మార్గంపై విల్ స్మిత్ తన బుక్ లోరాశాడు. మనుసుకు తగిలిన గాయం మానడానికి ఇవేవీ మార్గాలు కాదని రోజులు గడిచే కొద్దీ అదే తగ్గుముఖం పడుతుందన్నాడు. తాను ఆ బాధను మరిచిపోవడానికి ఎక్కువ మంది అమ్మాయిలో శృంగారం పెట్టుకున్నా ఫలితం లేకపోయిందని విల్ స్మిత్ పేర్కొన్నాడు. వయసు పెరిగే కొద్దీ అలాంటి గుర్తులు మాయమవుతాయని అంటున్నాడు. ప్రస్తుతం విల్ స్మిత్ ఓ అమ్మాయిని పెళ్లిచేసుకొని ఆమెతోనే కంటిన్యూ అవుతున్నారు.