సుశాంత్ మృతికి శామ్యూల్ మిరాండాకి సంబంధం ఏంటి..?

Wed Aug 05 2020 21:30:26 GMT+0530 (IST)

What has Samuel Miranda got to do with Sushant's death?

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ సూసైడ్ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. రోజులు గడిచే అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ క్రమంలో బాంద్రా మాజీ డిప్యూటీ కమిషనర్ పరంజిత్ సింగ్ దాహియా ఓ ఇంటర్వ్యూలో పలు కీలక విషయాలు వెల్లడించారు. సుశాంత్ సింగ్ తండ్రి కేకే సింగ్ సుశాంత్ ప్రాణానికి ముప్పు ఉందని ఫిబ్రవరిలో బాంద్రా పోలీసులకు ఫిర్యాదు చేసిన కంప్లైంట్ స్క్రీన్ షాట్ ను మీడియాకు చూపించారు. అంతేకాకుండా సుశాంత్ బావ ఐపీఎస్ ఆఫీసర్ ఓపీ సింగ్ దీనిపై రియా ఫ్రెండ్ శామ్యూల్ మిరాండా అనే వ్యక్తిని అనధికారికంగా అదుపులోకి తీసుకుని విచారించాలని కోరినట్లు కూడా తెలిపారు. ఓపీ సింగ్ కు సంబంధించిన వాట్సాప్ చాటింగ్ కూడా బయటపెట్టారు దాహియా.కాగా పరంజిత్ సింగ్ దాహియా మాట్లాడుతూ.. రియా చక్రవర్తిని పోలీస్ స్టేషన్ కు పిలిపించి బెదిరించాలని.. ఎంక్వైరీ కోసం ఆమె స్నేహితుడు శామ్యూల్ మిరాండాను అదుపులోకి తీసుకోవాలని ఓపీ సింగ్ బాంద్రా పోలీసులను కోరినట్లు వివరించారు. అయితే ఓపీ సింగ్ అధికారికంగా ఫిర్యాదు చేయడానికి ఇష్టపడలేదని.. ప్రతీ విషయం కూడా అనధికారికంగా నిర్వహించాలని కోరినట్లు పరంజిత్ సింగ్ దాహియా వెల్లడించారు. ఫిబ్రవరి ఫస్ట్ వీక్ లో ఓపీ సింగ్ ను తన బ్యాచ్ మేట్ ద్వారా కలిసానని.. అదే నెల 19 25 తేదీల్లో సింగ్ తనకు రియా చక్రవర్తిని అనధికారికంగా విచారించాలని.. ముంబై పోలీసులు శామ్యూల్ మిరాండాను ఒక రోజు అదుపులో ఉంచితే అసలు నిజాలు వాటంతట అవే బయటికి వస్తాయని వాట్సాప్ మెసేజ్ లు పెట్టారని పరంజిత్ చెప్పుకొచ్చారు.

అయితే అధికారిక వ్రాతపూర్వక కంప్లైంట్ లేకుండా విచారణ చేయడం సాధ్యం కాదని ఓపీ సింగ్ కు చేసినట్లు పరంజిత్ దాహియా పేర్కొన్నారు. ఇక ఆ తర్వాత ఓపీ సింగ్ ఎప్పుడూ తనని సంప్రదించలేదని.. ఏప్రిల్ 1 తర్వాత తాను బాంద్రా స్టేషన్ నుంచి బదిలీ అయినట్లు పరంజిత్ వెల్లడించారు. ఈ క్రమంలో జూన్ 14న సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు పరంజిత్ సింగ్ చెప్పిన విషయాలు మరో చర్చకు దారి తీస్తున్నాయి.