ఇంతకీ ఆ స్పేస్ లో ఏం జరుగుతోంది

Mon Apr 15 2019 17:16:19 GMT+0530 (IST)

What Is Going On In Navdeep C Space

ఇటీవలే ఉగాది పండగ సందర్భంగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అతిధిగా నటుడు నవదీప్ సి స్పేస్ అనే సంస్థను ప్రారంభించిన సంగతి తెలిసిందే. బంజారా హిల్స్ లో మూడు అంతస్తుల భవనంలో అట్టహాసంగా నిర్మించిన ఈ కంపెనీ గురించి దర్శకుడు తరుణ్ భాస్కర్ తో కలిసి నవదీప్ రూపొందించిన ప్రోమో వీడియో సోషల్ మీడియాలో బాగానే వైరల్ అయ్యింది.కొత్త టాలెంట్ ను ప్రోత్సహించేలా అన్ని వసతులు కల్పిస్తూ ఒక సదుద్దేశంతో దీన్ని మొదలుపెట్టామని పైసల కోసం చేస్తలేం బ్రో అంటూ నవదీప్ వీడియోలో చెప్పడం సంస్థ ఉద్దేశం ఏంటో చెప్పకనే చెప్పింది. ఇప్పుడిది మొదలై పది రోజులు అవుతోంది. దీని గురించి ఇంకా పూర్తి స్పష్టత రాని వర్గాలు పరిశ్రమలోనే ఉన్నాయి

విశ్వసనీయ సమాచారం మేరకు నవదీప్ కాన్సెప్ట్ ఉద్దేశం కొత్త టాలెంట్స్ కు స్పేస్ ని అద్దెకు ఇవ్వడం. అంటే దర్శకులు నిర్మాతలు రచయితలు సంగీత దర్శకులు లిరిసిస్టులు ఇలా ఎవరైనా ఇక్కడికి వచ్చి తమకు అనుకూలమైన స్పేస్ ను తీసుకుని తద్వారా తమ ప్రతిభను మెరుగుపర్చుకుని ఒకవేళ వాళ్ళ వర్క్ కనక బాగుంటే సి స్పేస్ లోని సౌకర్యాలు ఉపయోగించుకోవచ్చు.

సినిమానో షార్ట్ ఫిలిమో తీయడం ఫైనల్ కాపీ బయటికి తెచ్చుకోవడం అన్ని అక్కడే చేసుకోవచ్చు. ఇందుకుగాను చార్జీలు ఎంత వసూలు చేస్తున్నారు ఎంతమేరకు అవి అప్ కమింగ్ టాలెంట్స్ కు భరించేలా ఉన్నాయనే సమాచారం మాత్రం ఇంకా రావాల్సి ఉంది. బన్నీతో సినిమా ఓకే చేసుకున్న కొద్దిరోజులకే తన సి స్పేస్ ఓపెనింగ్ కి నవదీప్ తన హీరోనే గెస్ట్ గా తీసుకురావడం కాకతాళీయమేమో లేక అప్పుడు ప్రెస్ మీట్ లో చెప్పినట్టు స్నేహమో.