బిగ్ బాస్ విన్నర్ అభిజిత్ కు అసలేమైంది? హెల్త్ ఇష్యూస్ ఏమిటి?

Wed Sep 15 2021 10:03:35 GMT+0530 (IST)

What Happens To Biggboss Abhijeet

క్యూట్ గా.. సాఫ్ట్ గా ఉన్నట్లు కనిపించటంతో పాటు.. చాక్లెట్ బాయ్ ఇమేజ్ ను తన తొలి మూవీ 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' చిత్రంతో తెచ్చుకున్న అభిజిత్ ను ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సినిమాల కంటే కూడా.. బిగ్ బాస్ సీజన్ 4 విన్నర్ గా ఆయన ప్రజల మనసుల్లో నిలిచిపోయారు. బుద్ధి బలంతో విజేతగా నిలిచిన అభిజిత్ కు లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువని చెబుతారు.అభిజిత్ విజేతగా నిలిచిన బిగ్ బాస్ సీజన్ లో అతనితో పాటు హౌస్ లో ఉన్న ఇతర సెలబ్రిటీలు ఫేమస్ కావటమే కాదు.. ఎవరికి వారు వారికి నచ్చిన బిజినెస్ లోకి వెళ్లటం తెలిసిందే. మరికొందరికి రీల్ లైఫ్ లో మంచి అవకాశాలు లభించాయి. వీటన్నింటికి మించి.. అభిజిత్ మాత్రం..బయట పెద్దగా కనిపించని పరిస్థితి. దీంతో.. ఎందుకిలా? అన్నది ప్రశ్నగా మారింది. తాజాగా అభిజిత్ మాటల్ని వింటే.. అతనెందుకు బయట పెద్దగా కనిపించటం లేదన్నది సందేహంగా మారింది. తాజాగా దీనికి ఆన్సర్ వచ్చేసింది.

తాజాగా తన సోషల్ మీడియా ఖాతాలో.. 'ఆస్క్ మీ ఎనీథింగ్' అన్న సెషన్ ను నిర్వహించిన అభిజిత్ కు ఆయన అభిమానుల నుంచి ప్రశ్నలు.. కుప్పలుకుప్పలుగా వచ్చి పడ్డాయి. వాటిలో కొన్నింటికి ఆయన సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా అతగాడి కొత్త సినిమా అప్డేట్స్ గురించి అడగ్గా.. అందరి అంచనాలకు భిన్నంగా అభిజిత్ రియాక్టు అయ్యారు. ప్రస్తుతం తన ఆరోగ్యం బాగోలేదని.. సినిమాలు చేయట్లేదని చెప్పారు. అతగాడి మాటలకు అందరూ ఆశ్చర్యపోయే పరిస్థితి.

ఇప్పుడు తనకు అవకాశాల కంటే కూడా తన ఆరోగ్యమే ముఖ్యమని అభిజిత్ స్పష్టం చేశారు. ఇంత చెప్పిన అభిజిత్.. తాను ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్య ఏమిటి? అన్న ప్రశ్నను మాత్రమే సూటిగా సమాధానం ఇవ్వలేదు. ఇంతకూ అతగాడిని వేధిస్తున్న ఆరోగ్య సమస్య ఏమై ఉంటుందన్నది ఇప్పుడో పెద్ద టాస్కుగా మారిందని చెప్పక తప్పదు.