Begin typing your search above and press return to search.

ఆ రెండు రోజులు ఇబ్బంది ప‌డ్డాం - ఉపాస‌న‌

By:  Tupaki Desk   |   24 Jan 2021 2:30 AM GMT
ఆ రెండు రోజులు ఇబ్బంది ప‌డ్డాం - ఉపాస‌న‌
X
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ - ఉపాసన 2012లో వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టారు. దశాబ్ద కాలానికి దగ్గర్లో ఉన్న వీరి దాంపత్యం ఎంతో అన్యోన్యంగా సాగుతోంది. భార్య మనసు తెలుసుకున్న చెర్రీ.. భర్త వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకున్న ఉపాసన సంతోషంగా తమ బంధాన్ని కొనసాగిస్తున్నారు. అయితే.. ఇటీవల తాను పడ్డ ఇబ్బంది గురించి చెప్పిది ఉపాసన.

అయితే.. అది మరోరకమైన ఇబ్బందేం కాదు. ఇటీవల చెర్రీ కరోనా బారిన పడినప్పుడు ఎదురైన ఇబ్బంది గురించి వెల్లడించారు ఉపాసన. కొవిడ్ పాజిటివ్ రావడంతో రామ్ చరణ్ క్వారంటైన్లో ఉన్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మొదట్లో కాస్త ఇబ్బంది పడ్డట్టు వెల్లడించారు ఉపాసన.

చెర్రీకి పాజిటివ్ రావడంతో తాను కూడా టెస్ట్ చేయించుకున్నట్లు చెప్పారు. అయితే.. తనకు నెగెటివ్ వచ్చిందన్నారు ఉపాసన. కానీ.. పాజిటివ్ వచ్చేందుకు ఛాన్సెస్ ఉంటాయని వైద్యులు చెప్పడంతో.. తాను కూడా చెర్రీతో క్వారైంటైన్లో ఉన్నారట ఉపాసన.ఈ సమయంలో కాస్త కంగారు పడ్డామని, తొలి రెండు రోజులు కొద్దిగా ఇబ్బంది పడ్డామని వెల్లడించారు. అయితే.. ఆ తర్వాత తమ ప్రేమ, అభిమానం, అప్యాయతలతో ఈ గడ్డు పరిస్థితిని ధైర్యంగా ఎదుర్కొన్నామని చెప్పారు ఉపాసన.