Begin typing your search above and press return to search.

శింబు నిర్మాత‌ల‌కు జంతు సంర‌క్ష‌ణ బోర్డ్ నుంచి వార్నింగ్

By:  Tupaki Desk   |   21 Nov 2020 5:15 AM GMT
శింబు నిర్మాత‌ల‌కు జంతు సంర‌క్ష‌ణ బోర్డ్ నుంచి వార్నింగ్
X
శిలాంబ‌ర‌స‌న్ శింబు మ‌రోసారి వివాదంలో ఇరుక్కున్నాడు. యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా (AWBI) శింబు న‌టిస్తున్న‌ తమిళ చిత్రం `ఈశ్వరన్` మేకర్స్ కి నోటీసు జారీ చేసింది. సుసియంతిరాన్ దర్శకత్వం వహిస్తున్న‌ ఈ చిత్రం పొంగల్ 2021 కి విడుదల కానుంది. ఇంత‌కుముందు రిలీజైన ట్రైల‌ర్ వివాదాస్ప‌ద‌మైంది.

AWBI పంపిన నవంబర్ 16 నాటి లేఖ ప్రకారం... ట్రైలర్ పోస్టర్ ముందస్తు అనుమతి లేకుండా పాము (స్నేక్‌)ను వినోద మాధ్యమంగా చూపించారు.. పెర్ఫార్మింగ్ యానిమల్స్ (రిజిస్ట్రేషన్) నిబంధన2001కి ఇది వ్య‌తిరేకం. నిబంధ‌న‌ను ప్రత్యక్షంగా ఉల్లంఘిస్తూ బోర్డు నుండి ఎటువంటి ప్రీ షూట్ అనుమతి (పిఎస్పి) లేదా ఎన్‌.ఓ.సి పొందకుండా వినోద మాధ్యమంగా ఇలా జీవ‌జాలాన్ని చూపించ‌కూడ‌దు!! అని లేఖలో పేర్కొన్నారు. ప్రచార సామగ్రిని వెంటనే పంపిణీ చేయడాన్ని ఆపివేసి నోటీసు ఇచ్చిన ఏడు రోజుల్లో నోటీసుకు ప్రతిస్పందనను సమర్పించాలని బోర్డు నిర్మాతలను ఆదేశించింది.

మ‌రో నివేదిక ప్రకారం... ఒక సామాజిక‌ కార్యకర్త ఆ చిత్రంలో పామును ఉపయోగించారని ఫిర్యాదు చేయడంతో నిర్మాతలు రాష్ట్ర అటవీ శాఖ నుంచి ఇలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వ‌స్తోంది.ఈ ఆరోపణపై స్పందిస్తూ నిర్మాతలు ఒక ప్రకటన విడుదల చేశారు. వీడియోలో కనిపించే పాము ప్లాస్టిక్ పాము అని ఇది కంప్యూటర్ గ్రాఫిక్స్ ఉపయోగించి తయారు చేసిన‌ద‌ని చెప్పారు. అధికారిక రిలీజ్ లేకుండా ఈ వీడియో ఎలా లీక్ అయిందనే దానిపై దర్యాప్తు చేస్తున్నామని నిర్మాతలు తెలిపారు.

ఈ చిత్రం టీజర్ దీపావళి రోజు (నవంబర్ 14) తెల్లవారుజామున విడుదలైంది. సింబు గ్రామీణ యువ‌కుడి పాత్ర‌లో క‌నిపించారు ఇందులో. 1.28 నిమిషాల నిడివిగల ఈ టీజర్ ‌లో సింబు.. దర్శకుడు భారతీరాజ కీలక పాత్రలో విజువల్స్ ఉన్నాయి. నేపథ్యంలో జానపద సంగీతానికి సెట్ చేసిన యాక్షన్ సన్నివేశాలలో సింబును చూపించారు. ఇది కోవిల్ వంటి తన మునుపటి చిత్రాల త‌ర‌హాలో ఉంద‌ని శింబు అభిమానులు గుర్తు చేసుకున్నారు. మాధవ్ మీడియా నిర్మించిన ఈ చిత్రానికి ఎస్ తిర్రు సినిమాటోగ్రఫీని అందిస్తుండగా.., ఎస్.ఎస్ తమన్ సంగీతం సమకూర్చారు. ఆంథోనీ ఈ చిత్రానికి ఎడిట‌ర్ గా ప‌ని చేస్తున్నారు.