Begin typing your search above and press return to search.

ఓటీటీ కంటెంట్‌ లోనూ ఆ హెచ్చరిక తప్పనిసరి.. కేంద్రం కొత్త నిర్ణయం

By:  Tupaki Desk   |   31 May 2023 4:39 PM GMT
ఓటీటీ కంటెంట్‌ లోనూ ఆ హెచ్చరిక తప్పనిసరి.. కేంద్రం కొత్త నిర్ణయం
X
ఇప్పటి వరకు సినిమా థియేటర్‌ లో మరియు బుల్లి తెరపై వచ్చే కంటెంట్‌ లో మధ్యం తాగుతున్న సన్నివేశాలు లేదా పొగ తాగుతున్న దృశ్యాలు ఉంటే తప్పనిసరిగా మద్యపానం మరియు ధూమపానం ఆరోగ్యానికి హానికరం అంటూ కింద ఒక లైన్ వేయాల్సి ఉంటుంది. అంతే కాకుండా సినిమా ఆరంభంలోనే హెచ్చరిక వేయాల్సి ఉంటుంది.

ఒక వేళ అలా వేయకుంటే చట్ట ప్రకారం చిత్ర నిర్మాణ సంస్థతో పాటు యూనిట్‌ సభ్యుల్లో కీలక సభ్యులపై కఠిన చర్యలు తీసుకునే విధంగా చట్టం ఉంది.

అయితే ఈ మధ్య కాలంలో ఇండియా లో బాగా ఫేమస్ అయిన ఓటీటీ లో మాత్రం ఆ చట్టం లేదు. దాంతో విచ్చల విడిగా హద్దు పద్దు లేకుండా సిగరెట్‌ మరియు అశ్లీల సన్నివేశాలు మరియు మద్యం కు సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు.

ఇకపై అలా చెల్లదు. ఓటీటీ కంటెంట్‌ కూడా తప్పనిసరిగా మధ్యం కు సన్నివేశాలు ఉన్నా అలాగే ధూమపానం కు సంబంధించిన సన్నివేశాలు ఉన్నా కూడా తప్పనిసరిగా హెచ్చరికలు చేయాల్సి ఉంటుంది. అందుకు గాను 2004 నాటి చట్టంలో మార్పులను తీసుకు వచ్చినట్లుగా కేంద్ర ఆరోగ్య శాఖ అధికారులు ప్రకటించారు.

సినిమా థియేటర్ లో ఎలా అయితే ముందు మరియు మధ్య లో ఎలా 30 సెకన్ల వీడియోను మధ్య పానం మరియు ధూమపానంకు వ్యతిరేకంగా ప్రదర్శిస్తున్నారో అలాగే ఓటీటీ కంటెంట్‌ కు కూడా ఇకపై ప్రదర్శించాల్సిందే అంటూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.

ఒక వేళ ఇకపై నుండి వచ్చే కంటెంట్‌ కు అలా లేకుంటే కఠిన చర్యలు తప్పవు అంటూ ఓటీటీ లకు కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది.