ఓటీటీలోకి వాల్తేరు వీరయ్య.. ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?

Tue Feb 07 2023 15:16:38 GMT+0530 (India Standard Time)

Waltheru Veerayya into OTT..

మెగాస్టార్ చిరంజీవి తాజాగా నటించిన చిత్రం వాల్తేరు వీరయ్య ఏ రేంజ్ లో కాసుల వర్షం కురిపించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సంక్రాంతి సందర్బంగా జనవరి 13వ తేదీన విడుదలైన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది. బాబీ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండడంతో.. మాస్ ప్రేక్షకులకు సినిమా బాగా నచ్చింది. చాలా మంది ఈ సినిమాకు కనెక్ట్ అయ్యారు. మౌత్ టాక్ తో పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా బాక్సాఫీసు వద్ద భారీ ప్రభంజనం సృష్టించింది.అయితే మాస్ మాహారాజ్ రవితేజ మెగాస్టార్ చిరంజీవి కాంబోలో వచ్చిన ఈ చిత్రానికి సంబంధించిన లేటెస్ట్ అప్ డేట్ వచ్చింది. వాల్తేరు వీరయ్య సినిమాను థియేటర్ లో చూడలేకపోయిన ప్రేక్షకులతో పాటు మెగాస్టార్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది చిత్రబృందం. ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన నెట్ ఫ్లిక్స్ ఈ సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించింది. ఫిబ్రవరి 27వ తేదీన ఈ చిత్రం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కాబోతుంది. ఇందు కోసమే ప్రత్యేకంగా ఓ పోస్టర్ ను కూడా విడుదల చేశారు.

చిరంజీవి సరసన శ్రుతి హాసన్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ అందించిన మ్యూజిక్ కూడా ప్లస్ అయింది. ఇక చిరంజీవి మాస్ పెర్ఫార్మెన్స్ తో పాటు కామెడీ డ్యాన్సులు అభిమానులను ఉర్రూతలూగించాయి. చాలా కాలం తర్వాత చిరు.. యంగ్ అండ్ ఎనర్జిటిక్ గా కనిపించారంటూ చాలా మంది ప్రశంసలు కురిపించారు. మెగాస్టార్ ను అలా చూపించినందుకు డైరెక్టర్ కు చాలా మంది ప్రత్యేక ధన్యవాదాలు కూడా తెలిపారు. ఊర్వశీ రౌతేలా బాస్ పార్టీ అనే స్పెషల్ సాంగ్ లో చిరంజీవితో కలిసి స్టెప్పులేసింది. ప్రకాష్ రాజ్ బాబీ సింహ విలన్లుగా నటించారు.

మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య తర్వాత భోళా శంకర్ అనే మరో సినిమాను చేస్తున్నారు. ఈ చిత్రానికి మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తుండగా.. ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ క్రియేటివ్ కమర్షియల్ పతాకంపై అనిల్ సుంకర ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మణిశర్మ తనయుడు మహతి స్వరసాగర్ ఆ చిత్రానికి సంగీతం అందించబోతున్నట్లు సమాచారం. మరి ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలవుతుంది వంటి విషయాలను గురించి తెలియాలంటే ఇంకా కొంత కాలం ఆగాల్సిందే.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.