మెగాస్టార్ చిరంజీవి మాస్ మహారాజా రవితేజ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం 'వాల్తేరు వీరయ్య'. బాబీ దర్శకుడు. సంక్రాంతి జనవరి 13కి విడుదలై ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద తన జోరును ఇంకా కొనసాగిస్తోంది. రిలీజైన మూడు రోజుల్లోనే వందకోట్లు కలెక్ట్ చేసి బ్లాక్బస్టర్గా నిలిచిన ఈ చిత్రం ప్రభంజనం సృష్టిస్తోంది. అయితే తాజాగా ఈ సినిమా రిలీజై రెండు వారాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో కలెక్షన్ వివరాలు బయటకు వచ్చాయి.
రెండు తెలుగు రాష్ట్రాలు ఆంధ్ర తెలంగాణా కలిపి రూ.103.89కోట్లు నెట్ 168.05 గ్రాస్ వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు సమాచారం. మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా రూ.124.27కోట్ల నెట్ 212.40కోట్లు గ్రాస్ వచ్చినట్లు తెలుస్తోంది. మొత్తంగా ఈ మూవీ ఓవరాల్ బిజినెస్ రూ.88కోట్లు. బ్రేక్ ఈవెన్ రూ.89కోట్లు. కాబట్టి ఈ చిత్రానికి ఇప్పటికే రూ.35.27కోట్ల లాభం వచ్చినట్లు అయింది.
ఇప్పటికే ఈ సినిమా అమెరికాలో 2 మిలియన్ డాలర్ల క్లబ్లోకీ ప్రవేశించింది. ఈ విషయంపై చిరు కూడా ఇటీవలే ఆనందం వ్యక్తం చేస్తూ అమెరికాలో వివిధ ప్రాంతాల్లో నివసిస్తోన్న పలువురు అభిమానులతో జూమ్ కాల్లో మాట్లాడారు. తన చిత్రానికి మంచి విజయాన్ని ఇచ్చిన ఫ్యాన్స్కు కృతజ్ఞతలు చెప్పారు.
కాగా చిరు-రవితేజ అన్నదమ్ములుగా నటించిన ఈ చిత్రం కమర్షియల్ ఎంటర్టైనర్గా సూపర్ హిట్ను అందుకుంది.ముఖ్యంగా యాక్షన్ డ్యాన్స్లు సహా బ్రదర్ సెంటిమెంట్ ఎలిమెంట్స్ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా చిరు రవితేజ మధ్య వచ్చే సన్నివేశాలు బాగా అలరిస్తున్నాయి.
చిరు డ్యాన్స్లు నటన చూసిన వారందరూ వింటేజ్ చిరంజీవిని చూసినట్లు ఉందని తెగ సంబరపడిపోతున్నారు. మొత్తంగా ఫ్యామిలీ ఆడియెన్స్ను ఈ సినిమా బాగా అలరించింది. ఇకపోతే ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్ బాబీ సింహ కీలక పాత్రల్లో నటించారు. శ్రుతి హాసన్ కేథరిన్ హీరోయిన్స్గా కనిపించారు. వైజాగ్ బ్యాక్ డ్రాప్తో సాగే సినిమా ఇది. దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.