Begin typing your search above and press return to search.

వాల్తేరు, వీర సింహా.. 25రోజుల్లో వసూళ్లు ఎంతంటే?

By:  Tupaki Desk   |   6 Feb 2023 3:02 PM GMT
వాల్తేరు, వీర సింహా.. 25రోజుల్లో వసూళ్లు ఎంతంటే?
X
రీసెంట్​గా సంక్రాంతి రిలీజైన సినిమా జోరు తగ్గింది. ఇక కలెక్షన్స్​ మెల్లగా తగ్గిపోయాయి. కొత్త చిత్రాలు కూడా థియేటర్లలోకి వచ్చేశాయి. అయితే దీంతో సంక్రాంతికి ఒకరోజు గ్యాప్​లో రిలీజైన మెగాస్టార చిరంజీవి వాల్తేరు వీరయ్య, బాలయ్య వీర సింహా రెడ్డి దాదాపు 25రోజులు పూర్తిచేసుకున్నాయి. తాజాగా ఈ చిత్రాల కలెక్షన్స్ వివరాలు బయటకు వచ్చాయి.

మెగాస్టార్​ చిరంజీవి, మాస్​ మహారాజా రవితేజ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం 'వాల్తేరు వీరయ్య'. బాబీ దర్శకుడు. సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్​ను షేక్​ చేసింది. బ్లాక్ బస్టర్​ హిట్ టాక్​ను అందుకున్న ఈ చిత్రం తొలి రోజు నుంచి అదిరిపోయే వసూళ్లను అందుకుంది. అయితే ఈ చిత్రం విడుదలై 24 రోజులు పూర్తి చేసుకుంది. తాజాగా 24వ రోజు రూ.65లక్షలు వసూలు చేసింది.

మొత్తంగా 24 రోజుల్లో తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కలిపి.. ఏరియాల వారిగా కలెక్షన్స్ ఈ విధంగా ఉన్నాయి. నైజంలో రూ. 35.82 కోట్లు, సీడెడ్ లో రూ.18.09 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ.19.06 కోట్లు, ఈస్ట్ లో రూ.12.90 కోట్లు, రూ. వెస్ట్ లో రూ. 7.08 కోట్లు, గుంటూరులో రూ. 9.11 కోట్లు, కృష్ణ లో రూ. 7.66 కోట్లు, నెల్లూరులో రూ. 4.57 కోట్లు.. మొత్తంగా రూ. 114.39 షేర్, రూ. 185.08 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది.

వరల్డ్ వైడ్గా.. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా మిగతా చోట్ల కూడా మంచి వసూళ్ళను అందుకుంది. వరల్డ్ వైడ్​గా వాల్తేరు వీరయ్య రూ. 135.77 కోట్ల షేర్ కలెక్షన్స్ అందుకోగా.. 231.80 కోట్ల రేంజ్​లో గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయట. ఇకపోతే ఈ చిత్రం వరల్డ్ వైడ్​గా రూ. 88 కోట్ల రేంజ్​లో ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. అంటే ఈ మూవీ బ్రేక్ ఈవెన్​ రూ. 89 కోట్లు. ఇప్పుడు ఈ సినిమా మొత్తంగా షేర్ కలెక్షన్స్ రూ.135 కోట్లు రావడంతో ఇప్పుడీ చిత్రం రూ.47 కోట్ల వరకు లాభం సంపాదించింది.

25రోజుల్లో వీరసింహారెడ్డి... గోపిచంద్​ మలినేని దర్శకత్వంలో నటసింహం నందమూరి బాలకృష్ణ -హనీరోజ్​-శ్రుతిహాసన్ కలిసి నటించిన వీరసింహారెడ్డి జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ గా నిలిచింది. ఇక ఈ సినిమా విడుదలై 25రోజులు అయింది. .... బాక్స్ ఆఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. అయితే ఈ చిత్రం నాలుగు రోజుల్లో రూ.26లక్షలను అందుకుంది. మొత్తంగా 25 రోజుల కలెక్షన్స్ చూసుకుంటే.. నైజాం 17.31కోట్లు, సీడెడ్ రూ. 16.50 కోట్లు, ఉత్తరాంధ్ర రూ.8.55 కోట్లు, తూర్పు గోదావరి రూ.6.60 కోట్లు, పశ్చిమ గోదావరి రూ. 4.90 కోట్లు, గుంటూరు రూ.7.42 కోట్లు, కృష్ణ రూ. 4.73 కోట్లు, నెల్లూరు రూ. 3.00 కోట్లు వసూలు చేసింది.

రెండు తెలుగు రాష్ట్రాలు కలిపి రూ. 69.01 కోట్లు (రూ.112.25 కోట్లు గ్రాస్)గా ఉంది. కర్ణాటక ప్లస్ ఇతర ప్రాంతాలు రూ.4.85 కోట్లు, ఓవర్సీస్ రూ. 5.77 కోట్లు ప్రపంచ వ్యాప్తంగా 25 రోజులు కలిపి చూస్తే.. రూ. 79.63 కోట్లు షేర్ (రూ. 133.55 కోట్లు గ్రాస్) వసూళ్లు వచ్చాయి.ఇకపోతే 74 కోట్ల రేంజ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది సినిమా. 5.63 కోట్ల ప్రాఫిట్ పొందింది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.