Begin typing your search above and press return to search.

సంగీత దర్శకుడి తల్లికి కూడా వైరస్‌ పాజిటివ్‌

By:  Tupaki Desk   |   2 Jun 2020 8:10 AM GMT
సంగీత దర్శకుడి తల్లికి కూడా వైరస్‌ పాజిటివ్‌
X
బాలీవుడ్‌ ప్రముఖ సంగీత దర్శకుడు వాజిద్‌ ఖాన్‌ నిన్న ఉదయం మహమ్మారి వైరస్‌ కారణంగా మృతి చెందాడు. కుటుంబ సభ్యులు ఆయన మరణ వార్తను దృవీకరించారు. ఆయన మరణంకు వైరస్‌ కారణంగా వాజిద్‌ ఖాన్‌ సోదరుడు సాజిద్‌ ఖాన్‌ పేర్కొన్నాడు. వాజిద్‌ ఖాన్‌ వైరస్‌ వల్ల మృతి చెందినట్లుగా తేలడంతో ఆయన కుటుంబ సభ్యులందరిని కూడా టెస్టు చేశారు. ఈ సమయంలో వాజిద్‌ ఖాన్‌ తల్లి కూడా వైరస్‌ బారిన పడ్డట్లుగా వైధ్యులు నిర్ధారించారు. ప్రస్తుతం ఆమెను ఐసోలేషన్‌ లో ఉంచి చికిత్స అందిస్తున్నట్లుగా తెలుస్తోంది.

వాజిద్‌ ఖాన్‌ తల్లి రజీన కూడా వైరస్‌ పాజిటివ్‌ అని నిర్థారణ అవ్వడంతో కుటుంబ సభ్యులు మరియు బాలీవుడ్‌ వర్గాల వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆమెకు అనారోగ్య సమస్యలు ఉండటంతో ఆమె విషయమై కుటుంబ సభ్యులు ఆందోళనగా ఉన్నారు. ప్రస్తుతానికి ఆమె చికిత్సకు స్పందిస్తున్నట్లుగా వైధ్యులు పేర్కొన్నారు.

త్వరలోనే ఆమె పూర్తిగా కోలుకుంటుందని కుటుంబ సభ్యులు మరియు బంధు మిత్రులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వాజిద్‌ ఖాన్‌ మృతి విషయం నుండి బయట పడకుండానే ఆయన తల్లి కి వైరస్‌ సోకవడం బాధకర విషయం అంటూ బాలీవుడ్‌ ప్రముఖులు వారి కుటుంబానికి సానుభూతి తెలియజేస్తున్నారు.