Begin typing your search above and press return to search.

WWW సినిమా గొప్ప హిట్ అవుతుంది : రానా

By:  Tupaki Desk   |   14 Jan 2021 5:39 AM GMT
WWW సినిమా గొప్ప హిట్ అవుతుంది : రానా
X
దర్శకుడిగా మారిన ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కేవీ గుహన్ రూపొందించిన తాజా చిత్రం WWW (హూ,వేర్‌,వై). కల్యాణ్ రామ్ హీరోగా వచ్చిన ‘118’ చిత్రంతో తెలుగు తెరకు దర్శకుడిగా పరిచయమైన గుహన్.. WWWతో ప్రేక్షకులను అలరించబోతున్నారు. ఈ మూవీ ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ని రానా దగ్గుబాటి విడుదల చేశారు.

ఈ సందర్భంగా రానా మాట్లాడుతూ.. ‘గుహన్‌గారు ఒక యూనిక్‌ సినిమాటోగ్రాఫర్‌. ఆయనతో కలిసి పనిచేశాను. WWW సినిమా పోస్టర్‌ చూస్తుంటే హై కాన్సెప్ట్‌ ఫిలిం అనిపిస్తోంది. ఈ సినిమాలో విజువల్స్‌ సరికొత్తగా ఉంటాయి. ఈ మూవీ సూపర్ హిట్‌ అవుతుంది.’’ అన్నారు.

దర్శకుడు కేవీ గుహన్‌ మాట్లాడుతూ ‘లాక్‌డౌన్‌లో ఒక కొత్త కాన్సెప్ట్‌ అనుకుని ఈ సినిమా చేశాను. ఇది ఒక కాన్సెప్ట్‌ బేస్డ్‌ ఫిలిం. పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుపుకుంటోన్న మా చిత్రాన్ని త్వరలోనే విడుదలకు ప్లాన్‌ చేస్తున్నాం’’ అన్నారు.

ఇంకా పలువురు ఈ సినిమా గురించి మాట్లాడారు. ‘మిస్టరీ థ్రిల్లర్‌గా గుహన్‌గారు ఈ సినిమాని బాగా తీశారు’’ అన్నారు నిర్మాత రవి పి.రాజు ధాట్ల. కొత్త కాన్సెప్ట్‌తో ఈ మూవీని గుహన్‌గారు తెరకెక్కించారని హీరో అదిత్‌ అరుణ్ చెప్పుకొచ్చారు‌. ‘గుహన్‌గారి సినిమాలో నటించడం అదృష్టంగా భావిస్తున్నాను. నా తొలి సినిమా ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను లాంచ్‌ చేసిన రానాగారికి థ్యాంక్స్‌’’ అన్నారు హీరోయిన్ శివానీ రాజశేఖర్‌.

ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి రిలీజ్‌ చేయడానికి ప్లాన్‌ చేస్తున్నట్టు సహ నిర్మాత విజయ్‌ధరన్‌ ధాట్ల తెలిపారు. రామంత్ర క్రియేష‌న్స్ ప‌తాకంపై ర‌వి పి.రాజు దా‌ట్ల నిర్మిస్తున్న ఈ చిత్రానికి.. సిమ‌న్ కె. కింగ్ మ్యూజిక్ అందిస్తున్నారు.