నానిది 'వ్యూహం' కాదు మరేంటో?

Mon Apr 22 2019 19:15:03 GMT+0530 (IST)

Vyuham Is Not Nani And Sudheer Babu Film

యంగ్ హీరో నాని మోస్ట్ సక్సెస్ ఫుల్ జర్నీని కొనసాగిస్తూనే ఉన్నాడు. 'దేవదాస్' తో కాస్త దారి తప్పినట్లుగా అనిపించినా కూడా తాజాగా వచ్చిన 'జెర్సీ' చిత్రంతో నాని మరోసారి తన సత్తా చాటాడు. ఇప్పటికే 'జెర్సీ' చిత్రంతో 50 కోట్ల బిజినెస్ చేసిన నాని స్టార్ హీరోల సరసన చేరిపోయాడు. నాని చేస్తున్న - చేయబోతున్న సినిమాల గురించి అంతటా ఒకటే చర్చ జరుగుతుంది. ఇక గత కొన్ని రోజులుగా నాని చేయబోతున్న ఇంద్రగంటి చిత్రం గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. సుధీర్ బాబు హీరో అని - నాని కీలక పాత్ర అని - 'వ్యూహం' అనే టైటిల్ ను ఖరారు చేశారని వార్తలు వస్తున్నాయి. తాజాగా చిత్ర యూనిట్ సభ్యులు ఆ విషయమై క్లారిటీ ఇచ్చారు.మోహన కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో సుధీర్ బాబు హీరోగా నాని ముఖ్య పాత్రలో నటించబోతున్న సినిమాకు 'వ్యూహం' అనే టైటిల్ ను ఖరారు చేసినట్లుగా వస్తున్న వార్తల్లో నిజం లేదని - ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది. టైటిల్ పై ఇంకా ఎలాంటి నిర్ణయం అయితే తీసుకోలేదు. టైటిల్ గురించి ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత అధికారికంగా ప్రకటిస్తామంటూ యూనిట్ సభ్యులు చెబుతున్నారు. షూటింగ్ ప్రారంభంకు వెళ్లక ముందు లేదంటే వెళ్లిన వెంటనే అయినా టైటిల్ ను ప్రకటించే అవకాశం ఉందని సమాచారం.

నాని నటించబోతున్న చిత్రం అవ్వడంతో ఈ చిత్రంపై భారీగానే అంచనాలు ఉంటాయి. నాని హీరోగా కాకున్నా చిన్న పాత్ర పోషించినా కూడా సినిమా మార్కెట్ అనూహ్యంగా పెరగడం ఖాయం. నాని - ఇంద్రగంటిల కాంబోలో గతంలో వచ్చిన చిత్రాలు మంచి సక్సెస్ అయిన నేపథ్యంలో తప్పకుండా ఈ చిత్రంపై అంచనాలుండటం చాలా కామన్. ఈ చిత్రం గురించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది.