Begin typing your search above and press return to search.

VS11 అఫీషియల్.. విశ్వక్ సేన్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ మూవీ..

By:  Tupaki Desk   |   29 March 2023 1:40 PM GMT
VS11 అఫీషియల్.. విశ్వక్ సేన్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ మూవీ..
X
ఎలాంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినీ రంగ ప్రవేశం చేసిన విశ్వక్ సేన్ ఇప్పుడు హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు. హీరో గానే కాదు దర్శకుడుగా మారిన ఆయన గతంలో ఫలక్ నుమా దాస్ ఇటీవల ధాస్ కా ధమ్కీ సినిమాలతో వచ్చాడు. ప్రేక్షకులలో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు.

ఈరోజు విశ్వక్ సేన్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన సినిమాల నుంచి వరుస అప్డేట్లు వస్తున్నాయి. తాజాగా సితార ఎంటర్ టైన్‌మెంట్ ఫార్చ్యూన్ ఫోర్ సినిమా సంయుక్తంగా విశ్వక్ సేన్‌తో ఒక సినిమా చేస్తున్నట్లుగా అధికారిక ప్రకటన వచ్చేసింది. విశ్వక్ సేన్ కెరియర్ లో 11వ సినిమాగా రూపొందుతున్న ఈ సినిమాకి కృష్ణ చైతన్య దర్శకత్వం వహించబోతున్నారు. అంతే కాకుండా ఈ హీరో కెరీర్ లోనే ఇది బిగ్ బడ్జెట్ మూవీ అని తెలుస్తోంది.

నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాతలుగా వ్యవహరించబోతున్న ఈ సినిమాలో విశ్వక్ సేన్ మునిపెన్నడూ చూడని ఒక నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లో కనిపించబోతున్నట్లుగా సినిమా అనౌన్స్మెంట్ ద్వారా క్లారిటీ వచ్చేసింది. ప్రపంచంలో బ్లాక్ అండ్ వైట్ కాకుండా గ్రే అనే అసలు రంగు ఉందని.. విశ్వక్ క్యారెక్టర్ ఉంటుందని అర్థం వచ్చేట్టుగా ఈ సినిమా ఉంటుందని అంటున్నారు.

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ సినిమాకి యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు. ఈ మధ్య కాలంలో వరుస హిట్ల అందిస్తూ వస్తున్న యువన్ శంకర్ రాజా ఈ సినిమాకి అసోసియేట్ అవడంతో ఈ సినిమా కూడా సూపర్ హిట్ అవుతుందని భావిస్తున్నారు. చాలా కాలం తర్వాత కృష్ణ చైతన్య మెగాఫోన్ పట్టుకుంటూ ఉండటంతో ఆయన అభిమానులు కచ్చితంగా సినిమాతో మరో బ్లాక్ బస్టర్ అందుకుంటాడని భావిస్తున్నారు.

ఈ సినిమా షూటింగ్ రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనే విషయం మీద ఇప్పటివరకు క్లారిటీ ఇవ్వలేదు. కానీ నేహా శెట్టి ఈ సినిమాలో హీరోయిన్ గా ఎంపికైందంటూ గతంలో ప్రచారం జరిగింది.

ఆ విషయం మీద మాత్రం ఎలాంటి ప్రస్తావనా లేదు. విశ్వక్సేన్ కెరియర్ లోనే అత్యధిక భారీ బడ్జెట్లో ఈ సినిమా రూపొందుతోంది. శ్రీకర స్టూడియోస్ ఈ సినిమాని సమర్పిస్తోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.