Begin typing your search above and press return to search.

కృష్ణ‌చైత‌న్య‌తో మాస్ కా దాస్ విశ్వ‌క్ సేన్!

By:  Tupaki Desk   |   28 Jan 2023 5:00 PM GMT
కృష్ణ‌చైత‌న్య‌తో మాస్ కా దాస్ విశ్వ‌క్ సేన్!
X
టాలీవుడ్ లో వున్న యంగ్ హీరోల్లో ప్ర‌త్యేక‌త‌ను చాటుకుంటూ వ‌రుస సినిమాల్లో న‌టిస్తున్న హీరో మాస్ కా దాస్ విశ్వ‌క్ సేన్‌. ఇటీవ‌ల అర్జున్ వివాదంతో వార్త‌ల్లో నిలిచిన విశ్వ‌క్ సేన్ ఆ వివాదం నుంచి త‌న దృష్టిని లేటెస్ట్ యాక్ష‌న్ డ్రామా 'దాస్ క ధ‌మ్కీ' వైపు మ‌ళ్లించాడు. విశ్వ‌క్ సేన్ న‌టిస్తూ స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో ఈ మూవీని రూపొందిస్తున్నాడు. చిత్రీక‌ర‌ణ పూర్తి చేసుకున్న ఈ మూవీ రిలీజ్ కి రెడీ అవుతోంది. విశ్వ‌క్ సేన్ కెరీర్ లోనే తొలి పాన్ ఇండియా మూవీగా ఈ సినిమాను ఐదు భాష‌ల్లో రిలీజ్ చేస్తున్నారు.

విశ్వ‌క్ సేన్ ద‌ర్శ‌కుడిగా, నిర్మాత‌గా, హీరోగా భారీ అంచ‌నాలు పెట్టుకున్న ఈ మూవీ ఫిబ్ర‌వ‌రి 17న భారీ స్థాయిలో రిలీజ్ కాబోతోంది. నివేదా పేతురాజ్ హీరోయిన్ గా న‌టిస్తోంది. ఇప్ప‌టికే విడుద‌ల చేసిన ఈ మూవీ ప్ర‌చార చిత్రాలు సినిమాపై అంచ‌నాల్ని పెంచేస్తున్నాయి.

ప‌డిపోయిందే పిల్లా.. మావా.. అంటూ సాగే లిరిక‌ల్ వీడియోస్ ని తాజాగా విడుద‌ల చేశారు. ఇందులో 'ప‌డిపోయిందే పిల్లా' సాంగ్ లో హీరోయిన్ నివేదా పేతురాజ్ మ‌రింత గ్లామ‌ర్ గా క‌నిపించి క‌నువిందు చేసింది.

సినిమాపై అంచ‌నాలు పెరిగిన నేప‌థ్యంలో ఈ మూవీ త‌రువాత భారీ నిర్మాణ సంస్థ‌లో ప‌ని చేయాల‌ని చూస్తున్నాడ‌ట‌. ఈ నేప‌థ్యంలో విశ్వ‌క్ సేన్ క్రేజీ నిర్మాణ సంస్థ సితార ఎంట‌ర్ టైన్ మెంట్స్ లో ఓ సినిమాకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేసిన‌ట్టుగా తెలుస్తోంది. ఈ మూవీకి 'రౌడీ ఫెల్లో' వంటి విభిన్న‌మైన సినిమాని అందించిన కృష్ణ‌చైత‌న్య ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌బోతున్నాడు. త‌నే ఇటీవ‌ల నితిన్ తో 'ఛ‌ల్ మోహ‌న రంగ‌' మూవీని తెర‌కెక్కించిన విష‌యం తెలిసిందే.

రీసెంట్ గా స్టోరీని కూడా ద‌ర్శ‌కుడు కృష్ణ చైత‌న్య వినిపించ‌డం, నిర్మాత‌లు సితార నాగ‌వంశీ ఫైన‌ల్ చేయ‌డం చ‌క చ‌కా జ‌రిగిపోయాయని తెలిసింది. హీరో విశ్వ‌క్ సేన్ కు కూడా ద‌ర్శ‌కుడు కృష్ణ చైత‌న్య చెప్పిన‌ క‌థ న‌చ్చ‌డంతో ఈ మూవీకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేసిన‌ట్టుగా తెలుస్తోంది. ఏప్రిల్ నుంచి ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం అయ్యే అవ‌కాశాలు వున్నాయ‌ని ఇన్ సైడ్ టాక్‌. దీనికి సంబంధించిన మ‌రిన్ని వివ‌రాలు త్వ‌ర‌లోనే అధికారికంగా సితార వారు ప్ర‌క‌టించనున్నార‌ట‌.

ఇదిలా వుంటే ఇటీవ‌ల శ‌ర్వానంద్ క‌థానాయ‌కుడిగా కృష్ణ‌చైత‌న్య ద‌ర్శ‌క‌త్వంలో ఓ మూవీ లాంఛనంగా పూజా కార్య‌క్ర‌మాలు జ‌రుపుకున్న విష‌యం తెలిసిందే. శ‌ర్వా పెళ్లి ప‌నుల్లో బిజీగా వుండ‌టం వ‌ల్ల ఈ ప్రాజెక్ట్ రెగ్యుల‌ర్ షూటింగ్ ఆల‌స్యం అవుతూ వ‌స్తుండ‌టంతో విశ్వ‌క్ సేన్ తో సినిమాకు కృష్ణ చైత‌న్య రెడీ అయిపోయాడ‌ని తెలిసింది. అయితే విశ్వ‌క్ సేన్ తో చేయ‌బోతున్నా సినిమా శ‌ర్వానంద్ కు అనుకున్న క‌థేనా కాదా? అన్న‌ది తెలియాల్సి వుంది. ఈ మూవీ త‌రువాత శ‌ర్వానంద్ తో కృష్ణ చైత‌న్య సినిమా చేయ‌నున్నాడ‌ట‌.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.