అర్జున్ తో వివాదంపై విశ్వక్ సేన్ నో కామెంట్

Sat Mar 18 2023 19:28:13 GMT+0530 (India Standard Time)

Vishwak Sen NO comment on controversy with Arjun

విశ్వక్ సేన్ హీరోగా ప్రస్తుతం దాస్ కా దమ్కీ అనే సినిమా ప్రేక్షకుల ముందుకి రావడానికి రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. స్వీయ దర్శకత్వంలోనే విశ్వక్ సేన్ ఈ సినిమాని నిర్మించారు. మార్చి 22న ఈ మూవీ రిలీజ్ కాబోతుంది.మూవీ ప్రమోషన్ లో భాగంగా విశ్వక్ సేన్ కి విలేకరుల నుంచి ఊహించని ప్రశ్న ఎదురైంది. యాక్షన్ కింగ్ అర్జున్ తో మూవీ చేయడానికి ఒప్పుకొని మళ్ళీ తప్పుకున్నారు. అసలు ఆ వివాదం ఏంటి అని విలేకరి ప్రశ్నించారు.

అయితే ఆ అంశంపై తాను మాట్లాడాలని అనుకోవడం లేదని విశ్వక్ సేన్ పేర్కొన్నాడు. అయితే ఆ వివాదంలో మీరు పెద్ద మొత్తంలో డబ్బులు అర్జున్ కి చెల్లించారని ప్రచారం నడుస్తుంది కదా దీనిపై మీ మీ కామెంట్ ఏంటి అని ప్రశ్నించారు. దానికి కూడావిశ్వక్ సేన్ సమాధానం చెప్పలేదు. ఇప్పుడు మనం ఈ మూవీ గురించి మాట్లాడుకుందాం అని ఆ టాపిక్ మాట్లాడుకునే సందర్భం ఇది కాదని చెప్పి తప్పించుకున్నారు.

అలాగే ఎంతో మంది మీద ఉన్న గౌరవం కొద్ది నేను ఆ టాపిక్ మాట్లాడాలని అనుకోవడం లేదని విశ్వక్ చెప్పారు. ఇక దాస్ కా దమ్కీ మూవీకి ముందుగా నరేష్ కొప్పిలిని దర్శకుడిగా తీసుకొని ఎందుకు మార్చాల్సి వచ్చింది అని అడిగిన ప్రశ్నకి మాత్రం విశ్వక్ సమాధానం చెప్పాడు. పాగల్ సినిమాని తాను నరేష్ తో చేసానని అతని టేకింగ్ నచ్చి దాస్ కా దమ్కీ మూవీ దర్శకత్వ బాధ్యతలు అతనికి ఇవ్వాలని అనుకున్నా.

అయితే ఈ మూవీ స్క్రిప్ట్ చర్చల్లో అతని ఆలోచనకి దాస్ కా దమ్కీ కథకి సింక్ కాలేదు. దీంతో అతనితో మరో సినిమా చేస్తానని కమిట్మెంట్ ఇచ్చి ఈ మూవీని నేనే తెరకేక్కించాను అని విశ్వక్ పేర్కొన్నారు.

ఇందులో ఎలాంటి వివాదం కూడా లేదని అలాగే మా మధ్య ఎలాంటి గొడవలు కూడా జరగలేదని క్లారిటీ ఇచ్చాడు. మొత్తానికి దాస్ కా దమ్కీ ప్రమోషన్ ఈవెంట్ లో విలేకరులు విశ్వక్ సేన్ ని కాస్తా వివాదాస్పదమైన ప్రశ్నలతో ఇబ్బంది పెట్టె ప్రయత్నం చేసినా కూడా చాలా సున్నితంగా వాటిపై సమాధానాలు చెప్పకుండా విశ్వక్ తప్పించుకోవడం విశేషం.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.