విశ్వక్ సేన్ మామూలోడు కాదురా బుజ్జీ..

Sun Mar 26 2023 11:00:01 GMT+0530 (India Standard Time)

Vishwak Sen Dhamki Movie

విశ్వక్ సేన్.. తన మాటలతో చేతలతో ఎప్పుడూ వార్తల్లో వివాదాల్లో నిలుస్తుంటాడు ఈ కుర్ర హీరో. చిన్న వయస్సులోనే అటు హీరోగా ఇటు డైరెక్టర్ గా ప్రొడ్యూసర్ గా తనకంటూ పేరు సంపాదించుకున్నాడు. తన యాటిట్యూడ్ తో ఫ్యాన్స్ ను యాంటీ ఫ్యాన్స్ ను కూడా సంపాదించుకున్నాడు ఈ యంగ్ హీరో. అయితే విశ్వక్ సేన్ మాటలు యాటిట్యూడ్ కొందరికి నచ్చొచ్చు నచ్చకపోవచ్చు.కానీ అతడిని విస్మరించే పరిస్థితి మాత్రం ఉండదు. అలా తన చుట్టూ బజ్ క్రియేట్ చేసుకుంటాడు విశ్వక్ సేన్. తాను తీసిన కొన్ని సినిమాలు మంచి విజయాలను అందుకున్నాయి. మరికొన్ని సినిమాలు అపజయం పాలయ్యాయి. కానీ తన మూవీస్ తో జనానికి దగ్గరయ్యాడు విశ్వక్ సేన్.

తన మూవీస్ నచ్చినా నచ్చకపోయినా వాటి గురించి ఎంతో కొంత మాట్లాడుకునేలా చేశాడు ఈ హీరో.  అలా తన మార్కెట్ ను పెంచుకున్నాడు. ఇప్పుడు అతనికి అదే ప్లస్ గా మారింది. విశ్వక్ కొత్త సినిమా 'దాస్ కా ధమ్కీ'కి ఓపెనింగ్స్ లో ఇది స్పష్టంగా కనిపించింది.

విశ్వక్ సేన్ 'దాస్ కా ధమ్కీ' కృష్ణవంశీ తెరకెక్కించిన 'రంగమార్తాండ' దాదాపు ఒకే సమయంలో రిలీజ్ అయ్యాయి. 'దాస్ కా ధమ్కీ' మూవీకి నెగెటివ్ టాక్ రాగా.. 'రంగమార్తాండ' మాత్రం రిలీజ్ కు ముందు నుండి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. కానీ రెండింటి ఓపెనింగ్స్ పరిశీలిస్తే.. రంగమార్తాండ కంటే దాస్ కా ధమ్కీ ఓపెనింగ్స్ బాగున్నాయి.

'దాస్ కా ధమ్కీ' ఫస్ట్ డే రూ.8 కోట్లకు పైగా వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్ట్ చేసింది. తర్వాత 2 3 రోజుల్లో కలెక్షన్లలో కొద్దిగా డ్రాప్ కనిపించినా.. ఇదేమంతా ఎక్కువ కాదని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. మొదటి మూడు రోజుల్లో 'దాస్ కా ధమ్కీ' రూ.15 కోట్ల వరకు గ్రాస్ సాధించింది. విశ్వక్ స్థాయికి ఈ కలెక్షన్స్ చాలా పెద్దవని అంటున్నారు ఇండస్ట్రీ పెద్దలు. గతంతో పోలిస్తే విశ్వక్ సేన్ మార్కెట్ పెరిగిందని దాంతో కలెక్షన్లు ఎక్కువగానే నమోదవుతున్నాయని అంటున్నారు.