Begin typing your search above and press return to search.

వాయిదా పడిన విశ్వక్ సేన్ ధమ్కీ సినిమా, ఎందుకంటే?

By:  Tupaki Desk   |   7 Feb 2023 11:37 AM GMT
వాయిదా పడిన విశ్వక్ సేన్ ధమ్కీ సినిమా, ఎందుకంటే?
X
టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ హీరోగా నటిస్తూనే మరోవైపు దర్శకత్వం వహిస్తున్న చిత్రం ధమ్కీ. ఈయన సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. అయితే ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో రూపొందించేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడీ కుర్రహీరో. అలాగే షూటింగ్ పనుల్లో పడి చాలా బిజీగా మారిపోయాడు. ఈ చిత్రంలో విశ్వక్ సేన్ సరసన నివేదా పతురాజ్ కనిపించబోతోంది. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఓ లేటెస్ట్ అప్ డేట్ ను చిత్ర బృందం ప్రకటించింది.

అదేంటంటే.. గతంలో ప్రకటించినట్లుగా ఈ సినిమాను ఫిబ్రవరి 17వ తేదీన విడుదల చేయట్లేదని వివరించారు. అయితే రాబోయే రోజుల్లో సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటిస్తామని చిత్ర బృందం వెల్లడించింది. ఇంకా ఈ సినిమాకు సంబంధించిన ఒక పాటు, డబ్బింగ్ పనులు ఇంకా పూర్తి కాలేవని అందుకే సినిమా విడుదలను వాయిదా వేస్తున్నట్లు స్పష్టం చేశారు.

అయితే ఈ వారంలో హైదరాబాద్ లో ప్రధాన నటుడు మరియు ఇతరులపై పబ్ లో ఓ పాటను చిత్రీకరించబోతున్నట్లు కూడా తెలిపారు. ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఈ నెలాఖరులో ప్రారంభం కాబోతున్నట్లు వెల్లడించారు.

వన్మయే క్రియేషన్స్ మరియు విశ్వక్ సేన్ సినిమాస్ నిర్మించిన ఈ బహుభాషా చిత్రంలో రావు రమేష్, రోహిణి మొల్లేటి, అజయ్ తదితరులు ప్రముఖ పాత్రల్లో కనిపించబోతున్నారు. లియోన్ జేమ్స్ ఈ చిత్రానికి స్వరకర్త. గతేడాది నవంబర్ లో ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను గ్రాండ్ గా రిలీజ్ చేశారు.

నటసింహం నందమూరి బాలకృష్ణ చేతుల మీదుగా ఈ ట్రైలర్ ను లాంచ్ చేశారు. ట్రైలర్ చేస్తూ సినిమా చాలా రిచ్ గా తీసినట్లు అర్థం అవుతుంది. అయితే ఆరేళ్ల వయసున్న ఓ కంపెనీ, 10 వేల కోట్ల టర్నోవర్.. ఇవన్నీ ఒక్క రాత్రిలో స్టేట్ లో పడిపోగా... సాయానికి ఒక్క గడ్డిపోచైనా దొరక్క పోతుండా, ఆదుకునే ఒక్క మనిషైనా ఉండకపోతాడా అంటూ రావు రమేష్ చెప్పే డైలాగ్ తో ట్రైలర్ మొదలవుతుంది.

ఈ సినిమా ట్రైలర్ కు ప్రేక్షకులకు విశేష స్పందన వచ్చింది. ఫలక్ నుమా దాస్ సినిమాతో మంచి హిట్ అందుకొని మాస్ కా దాస్ గా పేరు తెచ్చుకున్న విశ్వక్ సేన్... ఈ మధ్య కేవలం మాస్ చిత్రాలే కాకుండా థ్రిల్లర్, లవ్, కామెడీ, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ సినిమాలు కూడా చేస్తున్నాడు. తాజాగా ఆయన మరోసారి ధమ్కీ సినిమాతో మాంచి యాక్షన్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అయితే ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియాలంటే ఇంకా కొంత కాలం ఆగాల్సిందే.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.