తారక్ ఇమేజ్ ఆస్కార్ కి మించి- విశ్వక్ సేన్

Sat Mar 18 2023 09:32:11 GMT+0530 (India Standard Time)

Vishwak Sen About Tarak

దాస్ కా దమ్కీ సినిమాతో యంగ్ హీరో విశ్వక్ సేన్ మార్చి 22న ప్రేక్షకుల ముందుకి రాబోతున్న సంగతి తెలిసిందే. స్వీయ దర్శకత్వంలో తండ్రి నిర్మాణంలో తెరకెక్కిన ఈ మూవీతో కమర్షియల్ హీరోగా విశ్వక్ సేన్ తనని తాను ఎస్టాబ్లిష్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే ప్రేక్షకుల ముందుకి వచ్చిన ట్రైలర్ సాంగ్స్ ఆకట్టుకున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా ఈ మూవీ ప్రీరిలీజ్ వేడుక జరిగింది. దీనికి చీఫ్ గెస్ట్ గా జూనియర్ ఎన్టీఆర్ రావడం విశేషం.ఆస్కార్ అవార్డుల వేడుకని ముగించుకొని అందరికంటే ముందు తారక్ హైదరాబాద్ వచ్చేశారు. ప్రత్యేకంగా ఈ ఈవెంట్ కోసమే తారక్ ముందుగా ఇండియా వచ్చినట్లు తెలుస్తుంది. ఇదిలా ఉంటే ఈ ఈవెంట్ లో విశ్వక్ సేన్ మాట్లాడుతూ తారక్ పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తాను రెండు నెలల క్రితం తారక్ అన్న కి ఫోన్ చేయగానే వెంటనే రెస్పాండ్ అయ్యి ఇంటికి పిలిచి భోజనం పెట్టి మాట్లాడారని అన్నారు. వెళ్ళిపోయే ముందు ఇలా ప్రీరిలీజ్ ఈవెంట్ కి రమ్మని చెబితే కచ్చితంగా వస్తా అని మాటిచ్చారు అని తెలిపాడు.

 అయితే ఈ మధ్య తారక్ ఇంట్లో జరిగిన డెత్ గురించి అందరికి తెలిసిందే. ఈ నేపధ్యంలో నేనే డిస్టర్బ్ చేయకూడదు అనుకున్న. అయితే అన్న కాల్ చేయించి మరీ డేట్ ఎప్పుడో కనుక్కోమని చెప్పాడు. ఆ మాటతో తారక్ మీద రెస్పెక్ట్ నాకు మరింత పెరిగిపోయింది. తారక్ అన్న యాక్టింగ్ కి ఎప్పుడో తాను ఇండియా మొత్తం చూసే స్థాయికి వెళ్తాడు అని చెప్పా అని ఇప్పుడు అది జరిగిందని అన్నాడు.  17 ఏళ్ళకి తొడలు కొట్టిన స్టేజ్ నుంచి ఆస్కార్ కి వెళ్ళే వరకు  అన్న ఇమేజ్ పెరిగిందని తెలిపారు.

 అనిల్ రావిపూడి చెప్పినట్లు ఇప్పటి వరకు తారక్ కెరియర్ లో ట్రైలర్ మాత్రమే చూశారు. ఇప్పుడు అసలైన సినిమా స్టార్ట్ అవుతుంది అని విశ్వక్ చెప్పడం విశేషం. ఇక తారక్ ముందు ఆస్కార్ కూడా తక్కువే అని ప్రశంసలు కురిపించాడు. ఇక తారక్ వస్తాడు అంటే ఎవరు ముందు నమ్మలేదని అయితే ఒక్కసారి మాట ఇస్తే కచ్చితంగా నిలబడతాడు అని విశ్వక్ చెప్పుకొచ్చాడు. అలాగే తారక్ అన్న రావడంతోనే నా సినిమా సూపర్ హిట్ అయిపోయింది అని విశ్వక్ చెప్పడం విశేషం.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.