Begin typing your search above and press return to search.

దినేష్ నాయుడు విశ్వక్ సేన్ ఎలా అయ్యాడు?

By:  Tupaki Desk   |   3 Jun 2023 9:58 AM GMT
దినేష్ నాయుడు విశ్వక్ సేన్ ఎలా అయ్యాడు?
X
టాలీవుడ్ ప్రస్తుతం జెట్ స్పీడ్ తో దూసుకుపోతోన్న యంగ్ హీరో విశ్వక్ సేన్. ఈ జెనరేషన్ కి కనెక్ట్ అయ్యే కంటెంట్ లతో ఫుల్ గా ఎంటర్టైన్ చేస్తూ సక్సెస్ ఫుల్ హీరోగా ఇతను కొనసాగుతున్నాడు. ప్రస్తుతం విశ్వక్ సేన్ చేతిలో మూడు, నాలుగు ప్రాజెక్ట్స్ వరకు ఉన్నాయి. అందులో కృష్ణ చైతన్య దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తోన్న సినిమా షూటింగ్ జరుగుతోంది.

ఇక విశ్వక్ సేన్ పేరు చాలా క్యాచీగా ఉండటంతో జనాల్లోకి కూడా వేగంగా దూసుకుపోయింది. అయితే విశ్వక్ అసలు పేరు ఇది కాదంట. అతని పేరు దినేష్ నాయుడు. అదే పేరుతో హీరోగా కెరియర్ స్టార్ట్ చేశాడు. వెళ్లిపోమాకే అంటూ తక్కువ బడ్జెట్ తో ఒక సినిమా చేశాడు. అయితే ఆ మూవీ ఎంతకూ రిలీజ్ కాలేదు.

రెండేళ్ళు రిలీజ్ కి నోచుకోకపోవడంతో న్యూమరాలజిస్ట్ కి చూపించడం జరిగింది. అయితే దినేష్ నాయుడు పేరుతో ఎలాంటి అభివృద్ధి, గుర్తింపు ఉండదని వారు చెప్పారు.

అదే సమయంలో వారే ఓ మూడు పేర్లు సూచించారు. అందులో విశ్వక్ సేన్ పేరు కొత్తగా అనిపించడంతో దానికే ఫిక్స్ అయ్యాను. అయితే బెంగాలీ పేరు ఎందుకు పెట్టుకున్నావ్ అని చాలా మంది అడిగారు.

ముందు ఏదో ఒక పేరు ఉంటే తర్వాత చూద్దాంలే అని డిసైడ్ అయ్యి అలాగే కొనసాగించా. పేరు మార్చుకున్నాక నెలరోజుల్లోనే వెళ్లిపోమాకే సినిమా రిలీజ్ అయ్యింది. ఆ సినిమా రిలీజ్ అయ్యి మూడు రోజుల తర్వాత ఈ నగరానికి ఏమైంది సినిమా ఆడిషన్స్ కి కాల్ వచ్చింది. అలా పేరు మార్చుకున్నాక లైఫ్ చేంజ్ అయిపొయింది.

దీంతో అదే పేరు కొనసాగించా. జీవితంలో ఏదైనా సాధించాలంటే ఓపిక ఉండాలని, అంత వరకు నెవ్వర్ గివ్ అప్ ఆటిట్యూడ్ తో ఉండాలని ఈ సందర్భంగా విశ్వక్ తన గురించి ఎవరికి తెలియని సీక్రెట్ ని రివీల్ చేశాడు. ఇప్పుడు అతని మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.