Begin typing your search above and press return to search.

ధమ్కీకి బదులు ధమాకా షో.. విశ్వక్ రియాక్షన్!

By:  Tupaki Desk   |   23 March 2023 10:18 AM GMT
ధమ్కీకి బదులు ధమాకా షో.. విశ్వక్ రియాక్షన్!
X
డైనమిక్ హీరో విశ్వక్ సేన్ తొలి పాన్ ఇండియా చిత్రం దాస్ కా ధమ్కీ గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈయన సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. అయితే ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో రూపొందించేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడీ కుర్రహీరో. ఈ చిత్రంలో విశ్వక్ సేన్ సరసన నివేదా పేతురాజ్ కనిపించబోతోంది. అయితే ఈ సినిమా మార్చి 22 అంటే నిన్న ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయింది.

ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ లోని వైజాగ్ లోని సుకన్య థియేటర్ లో కూడా ఈ చిత్రం రిలీజ్ చేశారు. కానీ తీరా అభిమానులంతా లోపలికి వెళ్లి చూసేసరికి ధమ్కీ చిత్రానికి బదులుగా మాస్ మహారాజ రవితేజ ధమాకా చిత్రం ప్లే అయింది.

దీంతో సినిమా చూసేందుకు వచ్చిన వారంతా కేకలు వేశారు. నానా రచ్చ చేయడంతో... విషయం గుర్తించిన యాజమాన్యం మళ్లీ విశ్వక్ సేన్ ధమ్కీ చిత్రం ప్లే చేశారు. ఇదే విషయాన్ని తెలుపుతూ డెయిలీ కల్చర్ అనే ట్విట్టర్ అకౌంట్ నుంచి ఈ వీడియోని పోస్ట్ చేశారు.

అయితే దీనిపై స్పందించిన యంగ్ హీరో విశ్వక్ సేన్ అప్పుడప్పుడూ అలా జరుగుతుందని రీట్వీట్ చేశారు. కన్ ఫ్యూజ్ అవ్వడం వల్లే అలా జరగిందన్నారు. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ హిందీ భాషల్లో బుధవారం రోజే ఈ సినిమాను విడుదల చేస్తున్నారు.

అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రానికి ప్రొడ్యూసర్, డైరెక్టర్, హీరో అన్నీ విశ్వక్ సేన్ యే. వన్మయే క్రియేషన్స్ మరియు విశ్వక్ సేన్ సినిమాస్ నిర్మించిన ఈ బహుభాషా చిత్రంలో రావు రమేష్, రోహిణి మొల్లేటి, అజయ్ తదితరులు ప్రముఖ పాత్రల్లో నటించారు. లియోన్ జేమ్స్ సంగీతం అందించగా.. రామ్ మిరియాల మావా బ్రో పాటను అందించారు.

ఫలక్ నుమా దాస్ సినిమాతో మంచి హిట్ అందుకొని మాస్ కా దాస్ గా పేరు తెచ్చుకున్న విశ్వక్ సేన్... ఈ మధ్య కేవలం మాస్ చిత్రాలే కాకుండా థ్రిల్లర్, లవ్, కామెడీ, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ సినిమాలు కూడా చేస్తున్నాడు. తాజాగా ఆయన మరోసారి ధమ్కీ సినిమాతో మాంచి యాక్షన్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.