Begin typing your search above and press return to search.

పెళ్లైన 2 నెలలకే విడాకుల బాటలోకి బ్యూటీపుల్ కపుల్

By:  Tupaki Desk   |   28 May 2023 8:37 AM GMT
పెళ్లైన 2 నెలలకే విడాకుల బాటలోకి బ్యూటీపుల్ కపుల్
X
ప్రేమ.. పెళ్లి.. ఆ తర్వాత విడాకులు. సామాన్యుల సంగతి ఎలా ఉన్నా.. సినీ జంటలు.. సెలబ్రిటీలలో తరచూ కనిపిస్తూ ఉంటాయి. అయితే.. ఇప్పుడు చెప్పే ఈ సినీ జంట రోటీన్ కు కాస్త భిన్నం. సాధారణంగా పెళ్లై ఏడాదికో.. నాలుగైదేళ్లకో విడాకుల బాట పడితే.. ఈ జంట మాత్రం పెళ్లైన 2 నెలలకే విడాకుల వరకు వెళ్లిపోయి సంచలనంగా మారారు.కోలీవుడ్ లో సంయుక్త విష్ణుకాంత్ దంపతుల్ని బ్యూటిఫుల్ జంటగా చెబుతారు. సిప్పినీల్ ముత్తు సీరియల్ లో కలిసి నటించిన ఈ ఇద్దరి మధ్య మొదలైన స్నేహం.. ప్రేమగా మారటం.. ఈ మధ్యనే (మార్చి 3న) ఘనంగా పెళ్లి చేసుకోవటం తెలిసిందే.

పెళ్లైన 2 నెలలకే ఈ జంట తాము విడిపోతున్నట్లుగా ప్రకటించి ఫ్యాన్స్ కు షాకిచ్చారు. చూడముచ్చటి జంట అనుకొని మురిసిపోతున్న వేళలోనే.. విడిపోవటం ఏమిటంటూ ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఇదిలా ఉంటే.. వీరిద్దరు సోషల్ మీడియాలో పెడుతున్న పోస్టులు మరింత సంచలనంగా మారుతున్నాయి. తాజాగా వీరిద్దరు తమ సోషల్ మీడియా ఖాతాలో ఉన్న పెళ్లి ఫోటోల్ని తొలగించారు.

ఈ సందర్భంగా విష్ణుకాంత్ పోస్టు పెడుతూ.. 'మౌనంగా ఉంటే ఎఫైర్స్ నిజమైన ప్రేమను కూడా ఫేక్ ప్రేమగా మార్చేస్తాయి' అని పేర్కొన్నారు. దీనికి బదులుగా అన్నట్లు సంయుక్త సైతం స్పందించింది. 'కొత్త జీవితానికి ప్రారంభం.. ఇకపై మరింత బలంగా ముందుకు వెళతా' అని పేర్కొంది. ఇక్కడితో ఆగితే బాగుండేది కానీ.. ఇక్కడే విష్ణుకాంత్ మరో అడుగు ముందుకు వేసి.. కొత్త రచ్చకు తెర తీశారు.

సంయుక్త తన మాజీ ప్రియుడు విజయ్ తో టచ్ లో ఉందన్న భావన కలిగేలా ఒక ఆడియో క్లిప్ ను పోస్టు చేశారు. ఇది కాస్తా వైరల్ గా మారింది. ఇందులో మాజీ ప్రియుడితే ఇంకా సన్నిహితంగా ఉందన్న భావన కలిగేలా ఉంది. పెళ్లి తర్వాత కూడా పాత ప్రియుడితో సంయుక్త టచ్ లో ఉన్న కారణంగానే తాను విడాకుల బాట పట్టినట్లుగా సంకేతాల్ని ఇస్తూ పోస్టు పెట్టాడు. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ క్లిప్ పై కొందరు మద్దతుగా రియాక్టు అవుతుంటే.. మరికొందరు మాత్రం విష్ణుకాంత్ తీరును తప్పు పడుతున్నారు. పెళ్లికి ముందు సంయుక్త వేరే వారితో ప్రేమలో ఉన్న విషయం తెలిసి.. కేవలం ఆమె అందం కోసమే పెళ్లాడిన విష్ణుకాంత్ ఇప్పుడు తనకేమీ తెలీదన్నట్లుగా వ్యవహరించటం సరికాదంటూ మండిపడుతున్నారు. అన్నింటికి మించి సోషల్ మీడియాలో ఆడియో క్లిప్ పోస్టు చేయటాన్ని తప్పు పడుతున్నారు.

'పాత ఆడియో క్లిప్ ను నెట్ లో పెట్టటం చాలా తప్పు. ఇక్కడ విష్ణునే సంయుక్త అందాన్ని చూసి.. ఆమెతో శారీరకంగా కలిసి ఉండాలనుకున్నాడు. కానీ.. పెళ్లి అనేది.. ప్రేమ.. నమ్మకం.. ఒకరినొకరు అర్థం చేసుకోవటం లాంటి అంశాల మీద ఆధారపడి ఉంటుంది. అందుకే వీరి వివాహ బంధం ముందుకు వెళ్లలేదు' అంటూ ఒక అభిమాని పోస్టు చేయటం కనిపిస్తుంది. మరో వ్యక్తి సంయుక్తకు అనుకూలంగా పోస్టు పెట్టాడు.

సంయుక్తను నిజంగా ప్రేమిస్తే.. ఆమెను అందరి ముందు అవమానపర్చటం సరికాదన్నారు. పెళ్లికి ముందు ఆమె గతం గురించి విష్ణుకాంత్ కు బాగా తెలుసని.. ఇప్పుడు ఏమీ ఎరగనట్లుగా పోస్టు పెట్టటాన్ని తప్పు పట్టాడు మరో అభిమాని. దీన్ని తాజాగాసంయుక్త ఇన్ స్టాలో తన స్టోరీగా షేర్ చేసి.. లవ్ ఎమోజీతో పాటు నమస్కారం పెడుతున్న ఎమోజీని పోస్టు చేయటం గమనార్హం. పెళ్లి వర్కువుట్ కానప్పుడు హుందాగా ఎవరికి వారు విడిగా ఉండటం బాగుంటుంది. అంతే తప్పించి.. ఎదుటోళ్లు తప్పు అనేలా వాదనలు వినిపించేందుకు వీలుగా పోస్టు పెట్టటం సబబు కాదనే చెప్పాలి.