ప్రేమించి పెళ్లి చేసుకున్న బ్యాడ్మింటన్ స్టార్ గుత్తా జ్వాల.. కోలీవుడ్ స్టార్ విష్ణు విశాల్ విడాకులు తీసుకోబోతున్నారు.. ఇద్దరు విడిగా ఉంటున్నారనే ప్రచారం జరిగింది. తమిళ మీడియాలో వస్తున్న పుకార్లకు బలం చేకూర్చే విధంగా విష్ణు విశాల్ ఇటీవల సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక పోస్ట్ ఉండటంతో వీరిద్దరి విడాకుల గురించి మరింతగా చర్చ జరిగింది.
కొన్ని రోజుల క్రితం సోషల్ మీడియాలో విష్ణు విశాల్... నేను చాలా ప్రయత్నించాను ప్రతి సారి విఫలం అయ్యాను.. మరేం పర్లేదు నేను దాన్ని గుణపాఠంగా తీసుకుంటాను. అది పరాజయం అని నేను అనుకోవడం లేదు నా తప్పుగా భావిస్తున్నాను.. మోసపూరిత ద్రోహంగానే భావిస్తున్నాను అన్నట్లుగా పోస్ట్ చేయడంతో చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుకున్నారు.
విష్ణు విశాల్ సోషల్ మీడియాలో షేర్ చేసిన పోస్ట్ తో గుత్తా జ్వాల తో విభేదాలు కన్ఫర్మ్.. ఇద్దరు విడిపోవడం కూడా కన్ఫర్మ్ అన్నట్లుగా ప్రచారం జరిగింది. కానీ తాజాగా విష్ణు విశాల్ తమ గురించి వస్తున్న పుకార్లకు స్పందించాడు. మీడియాలో వస్తున్న వార్తలు నిజం కాదని.. తన పోస్ట్ కు వ్యక్తిగత జీవితానికి సంబంధం లేదని వివరణ ఇచ్చాడు.
నేను చేసిన ట్వీట్ ను కొందరు తప్పుగా అర్థం చేసుకుని అతి దారుణంగా ఊహించుకున్నారు. ఆ ట్వీట్ లో నేను నా పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడలేదు. వ్యక్తిగత విషయాల గురించి కాకుండా వృత్తిపరమైన విషయాలను చెప్పాను. నేను చేస్తున్న ప్రయత్నాలు విఫలం అవుతున్నా కూడా గుణపాఠం నేర్చుకుని కొత్త ప్రాజెక్ట్ చేయాలని భావిస్తున్నట్లుగా పేర్కొన్నాడు.
విష్ణు విశాల్ క్లారిటీ ఇచ్చినా కూడా కొందరు మాత్రం సమ్ థింగ్ ఈజ్ ఫిషింగ్ భయ్యా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈయన కొత్త పోస్ట్ తో గత కొన్ని రోజులుగా వస్తున్న పుకార్లకు ఫుల్ స్టాప్ పడ్డట్లే అనే అభిప్రాయం ను కొందరు వ్యక్తం చేస్తున్నారు. చక్కగా కలిసి ఉన్న వారి గురించి పాపం విడాకులు అంటూ ప్రచారం జరగడం దారుణం అంటూ అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.