అనుష్క హైహీల్స్ పై విరాట్ వ్యంగ్యాస్ర్తం!

Tue Mar 21 2023 22:03:39 GMT+0530 (India Standard Time)

Virat Kohli On First Meeting With Anushka And Talking About High Heels

విరాట్ కోహ్లీ-అనుష్క శర్మల ప్రేమ పెళ్లి గురించి తెలిసిందే. తొలిసారి ఓ యాడ్ షూట్ లో కలిసారు. అటుపై స్నేహం ప్రేమగా మారి పెల్లి వరకూ దారి తీసింది. ప్రస్తుతం వాళ్లిద్దరి  ధాంపత్య జీవితానికి ఐదేళ్లు పూర్తయింది. ఇద్దరి ప్రేమకి కానుకగా ఓ పాప జన్మించింది. అయితే ఇద్దరు వేర్వేరు రంగాల నుంచి వచ్చిన వారు?  కావడంతో వాళ్ల లవ్ స్టోరీ ఎప్పటికీ ఎగ్జైట్ మెంట్ కలిగించేదే. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు అభిమానులు ఇద్దరు ఎలా కలిసారు? అని అడుగుతుంటారు. వాటికి తూతూ మంత్రంగా సమాధానం చెప్పి వదిలేయడమే. ఆ కలయిక ఎలా అన్న దానిపై డీటైలింగ్ లేదు.



వేర్వేరు రంగాల  నుంచి వచ్చి పెళ్లి వరకూ ఎలా ముందుకు సాగారు? అన్నది ఎప్పటికప్పుడు ఆసక్తికరంగానే అనిపిస్తుంది.  తాజాగా వీటన్నింటిపై విరాట్ వివరణ ఇచ్చే ప్రయత్నం చేసారు. ఇటీవలే  విరాట్  'ది 360 షో'లో  మాజీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సహచరుడు - సన్నిహిత మిత్రుడు AB డివిలియర్స్తో సాధారణ చాట్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా  అనుష్కని తొలిసారి కలవడం గురించి స్పందించారు.

పోడ్ కాస్ట్  లో విరాట్ మాట్లాడుతూ ` అది 2013  నాకు బాగా  గుర్తుంది. జింబాబ్వే టూర్కు నన్ను కెప్టెన్గా నియమించారు. నా మేనేజర్ నా దగ్గరకు వచ్చి నేను అనుష్క శర్మతో షూటింగ్ చేయబోతున్నాను అని చెప్పాడు. ఇది విన్న వెంటనే  చాలా భయంగా  అనిపించింది. నేను దీన్ని ఎలా చేయబోతున్నాను? అని కాస్త ఆందోళనకి గురయ్యాను.  అసలు ఆమెకు ఎలా హాయ్ చెప్పాలో? ఎలా మాట్లాడాలో అర్ధం కాలేదు.

ఆ తర్వాత లొకేషన్ లో ఆమెను కలిసా. ఆమె చాలా ఎత్తుగా కనిపించింది. కాళ్లకు హైహీల్స్ వేసుకుని ఉంది. అంతే దీనికంటే  ఇంకా ఎత్తుగా ఉన్న చెప్పులకు  మీకు దొరకలేదా? అన్నా ఆమె అదోలా చూసింది. ఆ తర్వాత షూటింగ్ రోజంతా జరిగింది. ఆరోజే ఆమె కూడా సాధారణమైన అమ్మాయిలా అనిపించింది. అలా ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. ఇద్దర్ని కుటుంబ విషయాలు దగ్గర చేసాయి.

మధ్యతరగతి కుటుంబాలు కావడంతో  కనెక్ట్ అయ్యాం. పరిచయమైన  వెంటనే డేటింగ్ లో లేము. చాలా రోజులు మాట్లాడుకున్నాం. అయినా తొలి రోజు నుంచే అమెతో డేటింగ్ లో ఉన్నట్లు అనిపించింది. మాటల సందర్భంలో డేటింగ్ లో ఉన్నట్లు అనిపిస్తుందని మెసెజ్ పెట్టా. దీంతో ఆమె షాక్ అయింది. తర్వాత ఆ మ్యాటర్ గురించి మళ్లీ మాట్లాడుకోలేదు. ఓరోజు నా గురించి ఏమనుకుంటున్నావ్ అని అడిగింది.

వెంటనే ఇద్దరం డేటింగ్ లో ఉన్నామని చెప్పా. అప్పుడు ఆమె ఇబ్బంది పడింది. ఆ తర్వాత కొద్ది  రోజులకు క్రమంగా అర్ధం చేసుకుంది. అలాగే డేటింగ్ కి ముందు ఆమెకు రెండు సందర్భాల్లో  ఇబ్బందికర మెసెజ్ లు పెట్టినట్లు కోహ్లీ గుర్తు చేసుకున్నాడు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.