ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తెలుగు చలనచిత్ర పరిశ్రమలో 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. రెండు దశాబ్ధాల్లో అతడి స్టార్ డమ్ అంచెలంచెలు గా పెరిగింది. ఇప్పుడు పాన్ ఇండియా(వరల్డ్) స్టార్ గా ఎదిగాడు. తదుపరి పుష్ప2 తో సంచలనాలు సృష్టించేందుకు సిద్ధమవుతున్నాడు. ఐకాన్ స్టార్ అద్భుతమైన ప్రయాణం పై సినీ వర్గాలు సహా అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
ఓవైపు సుకుమార్ దర్శకత్వంలో పుష్ప 2 షెడ్యూల్స్ ని పూర్తి చేస్తూనే షూట్ గ్యాప్ లో చిన్నపాటి వెకేషన్ల ను ఆస్వాధిస్తున్నాడు. తన బిజీ షెడ్యూల్ నుండి విరామం తీసుకుని తన కుటుంబంతో ఆనందించడాని కి ఎల్లప్పుడూ బన్ని సిద్ధంగా ఉంటాడు. కొద్దిసేపటి క్రితం అల్లు వైఫ్ అల్లు స్నేహా రెడ్డి తన ఇన్ స్టా హ్యాండిల్ లో ఒక వీడియోను పోస్ట్ చేసారు.
అది ఇప్పుడు వైరల్ గా మారింది. వీడియోలో బన్ని తన అందమైన భార్యతో కలిసి వెకేషన్ ని ఎంజాయ్ చేస్తున్నారు. భార్య స్నేహ రెడ్డి తో కలిసి విహారయాత్రకు సంబంధించిన అందమైన లొకేషన్లు అక్కడ ఆస్వాధించిన ఆహారాన్ని ఈ వీడియోలో వీక్షించవచ్చు.
ఈ వీడియోలో అందమైన ప్రకృతి చుట్టూ కొండలు మధ్యలో బ్లూ వాటర్స్.. హిల్ టాప్ రిసార్ట్ ఎంతో ప్లెజెంట్ గా కనిపిస్తోంది. మరోవైపు నత్తలు రొయ్యలు చేపలతో పాటు ఇతర మాంసాహారం తో స్పెషల్ డిషెస్ అన్నీ రెడీ అయి టేబుల్ పై కనిపిస్తున్నాయి.
వెకేషన్ లో అన్ని రకాల వంటకాలను బన్ని అండ్ ఫ్యామిలీ ఆస్వాధించిందని దీనిని బట్టి అర్థమవుతోంది. ఇన్ స్టా వీడియోవ వీక్షించాక బన్ని ఫ్యాన్స్ వెంటనే కామెంట్ సెక్షన్ లో తమ ప్రేమాభిమానాలను కురిపించారు. కెరీర్ మ్యాటర్ కి వస్తే అల్లు అర్జున్ తదుపరి చిత్రం సుకుమార్ దర్శకత్వంలో `పుష్ప ది రూల్`లో కనిపించనున్నాడు. వచ్చే ఏడాది ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.