Begin typing your search above and press return to search.

వైరల్ పిక్: డిగ్రీ పట్టాతో బాద్ షా తనయుడు..!

By:  Tupaki Desk   |   17 May 2021 1:06 PM GMT
వైరల్ పిక్: డిగ్రీ పట్టాతో బాద్ షా తనయుడు..!
X
ప్రతి ఇండస్ట్రీలో నెపోటిజం ఉన్నా సినిమా పరిశ్రమలో నెపోటిజం అనేది ఎప్పుడూ హైలైట్ అవుతూ ఉంటుంది. టాలెంట్ తో సంబంధం లేకుండా నటవారసులని బలవంతంగా ప్రేక్షకుల మీదకి రుద్దుతారని కామెంట్స్ ఎక్కువగా వస్తుంటాయి. అయితే నిజానికి నెపోటిజం హీరోలను రెడీ చేసేది అభిమానులే. తమ ఫేవరేట్ స్టార్స్ తో పాటు వారి పిల్లలను కూడా ఆకాశానికెత్తేస్తూ సోషల్ మీడియాలో సెలబ్రిటీలుగా మార్చేస్తుంటారు. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చిందంటే తాజాగా బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ త‌న‌యుడి గురించి సోషల్ మీడియాలో డిస్కషన్ జరుగుతోంది.

షారుఖ్ - గౌరీఖాన్ దంపతులకు ఆర్యన్ ఖాన్ - సుహానా ఖాన్ - అబ్రామ్ ఖాన్ అనే ముగ్గురు పిల్లలు ఉన్నారనే సంగతి తెలిసిందే. ఈ స్టార్ కిడ్స్ కి సోషల్ మీడియాలో మామూలు ఫాలోయింగ్ లేదు. ఇప్పటికే సుహానా ని హీరోయిన్ గా లాంచ్ చేస్తారనే వార్తలు వస్తున్నాయి. విదేశాల్లో ఫిల్మ్ మేకింగ్ అండ్ యాక్టింగ్ లో శిక్ష‌ణ తీసుకున్న సుహానా సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతోంది. ఇదే క్రమంలో తండ్రిలానే అందంగా ఉండే పెద్ద కొడుకు ఆర్య‌న్ కూడా హీరో అవ్వాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అయితే ఫిల్మ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టాలని నిర్ణయించుకున్న ఆర్యన్ మాత్రం ఫిల్మ్ మేక‌ర్ గా మారాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.

ఆర్య‌న్ ఖాన్ ఇప్పటికే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కొలంబియాలో ఫిల్మ్ మేకింగ్ లో కోర్సు చేస్తున్నాడు. ఇటీవ‌ల యూనివ‌ర్సిటీ నుండి ఫైన్ ఆర్ట్స్, సినిమాటిక్ ఆర్ట్స్ లో డిగ్రీ ప‌ట్టా కూడా పొందాడు. ఫిల్మ్ అండ్ టెలివిజ‌న్ ప్రొడ‌క్ష‌న్ స్కూల్ ఆఫ్ సినిమాటిక్ ఆర్ట్స్ లో డిగ్రీ ప్ర‌ధానోత్స‌వం సంద‌ర్భంగా తీసిన ఆర్యన్ ఫోటో ఒక‌టి సోష‌ల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో ఆర్యన్ తండ్రి బాటలో నడవకుండా తల్లి బాటలో ఫిలిం మేకర్ అవ్వాలని చేస్తున్నట్లు కామెంట్స్ చేస్తున్నారు. కాకపోతే ఫిలిం మేకింగ్ కోర్స్ చేసినంత మాత్రానా హీరోగా సినిమాలు చేయడని కాదు కదా. ఏదేమైనా షారుఖ్ ఖాన్ వార‌సులు ఒక‌రి త‌ర్వాత ఒక‌రు సినీ ఇండస్ట్రీలోనే ఎంట్రీ ఇవ్వడం ఖాయమని అర్థం అవుతోంది.