వైరల్ : స్టార్ హీరోలతో 'ఆస్కార్' స్టార్

Sat Apr 01 2023 19:29:56 GMT+0530 (India Standard Time)

Viral: 'Oscar Star' with star heroes

ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాట తో ఏకంగా ఆస్కార్ అవార్డును సొంతం చేసుకున్న సంగీత దర్శకుడు కీరవాణి అప్పటి నుండి ఇప్పటి వరకు ఏదో ఒక రూపంలో.. ఎవరి నుండో ఒకరి నుండి ప్రశంసలు అందుకుంటూనే ఉన్నాడు. ఆస్కార్ ను ఇండియాకు తీసుకు వచ్చిన గొప్ప సంగీత దర్శకుడు కీరవాణి అంటూ ఆయనను సినీ ప్రేమికులు ప్రశంసిస్తున్నారు.



ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి తన తనయుడు రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా జక్కన్న మరియు కీరవాణి టీమ్ ను ఆహ్వానించి ఆస్కార్ అవార్డ్ దక్కిన సందర్భంగా ఘనంగా సత్కరించిన విషయం తెల్సిందే. ఆ తర్వాత కూడా కీరవాణికి మరియు నాటు నాటు టీమ్ కు ప్రశంసలు సత్కారాలు లభిస్తూనే ఉన్నాయి.

ఆస్కార్ అవార్డ్ లభించిన మ్యూజిక్ స్టార్ కీరవాణిని తాజాగా టాలీవుడ్ స్టార్ హీరోలు అయిన వెంకటేష్ మరియు నాగార్జున కలిశారు. సాధారణంగా వెంకీ మరియు నాగ్ కలిస్తేనే చాలా గొప్ప విషయం.

ఆ ఫ్రేమ్ అదిరి పోతుంది. అలాంటిది ఈ ఇద్దరు స్టార్ హీరోలతో ఆస్కార్ దక్కించుకున్న స్టార్ కీరవాణి కూడా జత కలవడం కన్నుల విందుగా ఉందంటూ కామెంట్స్ వస్తున్నాయి.

ఈ ఇద్దరు హీరోల సినిమాల్లో చాలా సినిమాలకు కీరవాణి సంగీతాన్ని అందించారు. ఇద్దరికి కూడా మ్యూజికల్ బ్లాక్ బస్టర్స్ ను అందించిన ఘనత కీరవాణికి దక్కింది.

అందుకే కీరవాణి కి ఆస్కార్ దక్కిన సందర్భంగా ఇద్దరు హీరోలు అభినందించి ఇలా ఫొటో కు ఫోజ్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట వైరల్ అవుతోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.