పవర్ స్టార్ మూవీలో మాస్ డైరెక్టర్ గెస్ట్ రోల్..?

Thu Jun 10 2021 08:00:01 GMT+0530 (IST)

Vinayak To Come Onboard For Pawan

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - రానా దగ్గుబాటి కలిసి ‘అయ్యప్పనుమ్ కోశియుమ్’ తెలుగు రీమేక్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. సాగర్ కె.చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే - డైలాగ్స్ అందిస్తున్నాడు. ఇందులో నిజాయితీ గల ఇగోయిస్ట్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో పవన్ నటిస్తుండగా.. అతనికి పోటీగా నిలిచే  రిటైర్ట్ హవల్దార్ గా రానా కనిపించనున్నారు. అయితే ఈ చిత్రంలో మాస్ డైరెక్టర్ వి.వి.వినాయక్ గెస్ట్ రోల్ పోషిస్తున్నట్లు టాక్ నడుస్తోంది.'అయ్యప్పనుమ్ కోశియుమ్' చిత్రంలో డైరెక్టర్ సాచీ క్యామియో రోల్ లో కనిపించారు. ఇప్పుడు అదే పాత్రను తెలుగులో వినాయక్ తో చేయిస్తున్నారట. వినాయక్ గతంలో 'ఠాగూర్' 'నేనింతే' 'ఖైదీ నెం. 150' వంటి చిత్రాల్లో గెస్ట్ అప్పీయరెన్స్ ఇచ్చారు. ఈ క్రమంలో దిల్ రాజు బ్యానర్ లో 'శీనయ్య' సినిమా స్టార్ట్ చేశారు కానీ.. ఎందుకో అది ముందుకు సాగలేదు. ఇప్పుడు 'ఏకే' రీమేక్ లో మరోసారి మెరవనున్నారని అంటున్నారు. ఇందులో నిజమెంతో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.

కాగా 'PSPKRana' సినిమా షూటింగ్ ఇప్పటికే 40 శాతానికి పైగా పూర్తయింది. పవన్ ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకొని స్క్రిప్టులో పలు మార్పులు చేస్తున్నారు. థమన్ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రానికి ప్రసాద్ మూరెళ్ళ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. నవీన్ నూలి ఎడిటింగ్ చేస్తుండగా.. ఏఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఈ సినిమా రూపొందుతోంది.