రాజావారు రాణిగారు ఎస్. ఆర్. కల్యాణ మండపం సమ్మతమే తదితర చిత్రాలతో యువతను ఆకర్షించిన టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ కిరణ్ అబ్బవరం. నవతరం కథనాలతో ఆడియన్స్ ను ఆకర్షిస్తూ ప్రేక్షకులకు వినోదాన్ని అందిస్తున్నాడు. ఇప్పుడు అతడు GA2 బ్యానర్ లో వినరో భాగ్యము విష్ణు కథ అనే సినిమాను చేస్తున్నాడు. ఈ సినిమా ఫిబ్రవరి 17న శివరాత్రి స్పెషల్ కానుకగా విడుదల కానుంది.
ఈ నేపథ్యంలోనే ప్రమోషన్స్ ను ప్రారంభించింది మూవీ టీం. ఇప్పటికే ఈ ఇంటెన్స్ యాక్షన్ డ్రామాకి సంబంధించి విడుదలైన పాటలు టీజర్ అందర్నీ బాగా కట్టుకున్నాయి. తాజాగా వఈ చిత్ర మేకర్స్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించి ట్రైలర్ను విడుదల చేశారు. మెగా సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ ఈ ట్రైలర్ను రిలీజ్ చేసి టీమ్కు శుభాకాంక్షలు తెలిపారు.
ట్రైలర్ మొత్తం చాలా ఇంటరెస్టింగ్ గా సాగింది. ఫోన్ నెంబర్ నైబర్ అనే కాన్సెప్ట్ తో ఈ మూవీ స్టోరీని డిజైన్ చేశారు దర్శకుడు. మన ఫోన్ నెంబర్ లో లాస్ట్ డిజిట్ కి అటు పక్క ఒక నెంబర్ ఇటు పక్క ఒక నెంబర్ ఉంటుంది కదా. అలా హీరోయిన్ తన నెంబర్ కి ఉన్న నైబర్ నంబర్స్ ని కాంటాక్ట్ అవుతుంది. అందులో ఒక నెంబర్ హీరో కిరణ్ అబ్బవరంది మరో నెంబర్ మురళీశర్మది. ఈ ముగ్గురు మధ్య జరిగే ప్రేమ సన్నివేశాలు ఆడియన్స్ ని అలరించేలా ఉండబోతున్నట్లు తెలుస్తుంది.
ఇక హీరోయిన్ లాగానే హీరో నెంబర్ కి కూడా నైబర్ నంబర్స్ ఉంటాయి కదా. వాటిలో ఒక నెంబర్ హీరోయిన్ది అయితే మరో నెంబర్ విలన్ది. ఇలా నైబర్ నంబర్స్ ని కాంటాక్ట్ అవ్వడం వల్ల హీరో హీరోయిన్ అనుకోని ప్రమాదంలో పడతారు. దాని నుంచి వాళ్ళు ఎలా తప్పించుకున్నారు అనేదే మిగిలిన కథ అని ట్రైలర్ చూస్తుంటే తెలుస్తుంది. ఇక ఈ ట్రైలర్ కి బాక్గ్రౌండ్ స్కోర్ తోడై తదుపరి స్థాయికి తీసుకువెళ్లింది. కిరణ్ అబ్బవరం యాక్షన్ రొమాన్స్ కామెడీ సీన్స్ ఆకట్టుకుంటున్నాయి.
కాగా ఈ చిత్రాన్ని GA2 పిక్చర్స్ పతాకంపై బన్నీ వాస్ నిర్మించగా అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు. కశ్మీరా కథానాయికగా నటిస్తుండగా మురళీ శర్మ కీలక పాత్రలో నటిస్తున్నారు. చైతన్ భరద్వాజ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. డేనియల్ విశ్వాస్ ఫోటోగ్రఫీ దర్శకుడు. మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటర్.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.