Begin typing your search above and press return to search.

విమానం@ ట్రైలర్ తోనే ఏడిపించేశారు..!

By:  Tupaki Desk   |   1 Jun 2023 1:25 PM GMT
విమానం@ ట్రైలర్ తోనే ఏడిపించేశారు..!
X
విమానం ఎక్కడం కొందరికి చాలా సాధారణం కావచ్చు. కానీ కొందరికి అది జీవితంలో చాలా పెద్ద కల. ఓ చిన్న పిల్లాడు ఊహ తెలిసినప్పటి నుంచి అదే కల కంటూ ఉంటాడు. ఎప్పటికైనా విమానం ఎక్కాలి అనేది ఆ బాబు ఆశ. తన కొడుకు కోరికని తీర్చడానికి ఓ తండ్రి పడే వేధన మరో వైపు. మరి నిజంగా తన కొడుకు కలను తండ్రి నిజం చేశాడా? మరి ఆ బాబు విమానం ఎక్కాడా? అతని కోరిక ఎవరు నెరవేర్చారు అనే కథాంశంతో 'విమానం' సినిమా చిత్రీకరించారు.

ఈ చిత్రానికి శివ ప్రసాద్ దర్శకత్వం వహించారు. జీ స్టూడియోస్‌, కిర‌ణ్ కొర్ర‌పాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ఆ చిన్న పిల్లాడి తండ్రిగా ప్రముఖ నటుడు సముద్ర కణి కనిపిస్తున్నారు. తండ్రి లేని తన కొడుకు ను తనకు వీలైనంత వరకు సంతోషంగా చూసుకునే పాత్రలో ఆయన నటించారు. అందులో ఆయన అంగ వైకల్యంతో ఉన్న వ్యక్తి గా కనిపిస్తున్నారు.

తాజాగా ఈ సినిమా కు సంబంధించిన ట్రైలర్ విడుదల చేశారు. ఈ ట్రైలర్ చూసిన వారు ఎవరైనా కన్నీళ్లు పెట్టుకొని తీరతారు. కేవలం ట్రైలర్ తోనే ఏడిపించేశారు. ఇక సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఓ తండ్రి, కొడుకుల ఎమోషనల్ రైడ్ వీరికి తోడు వీరిచుట్టూ ఉండే కొందరి కథలు, ఓ వేశ్య కథ ను మేళవించి ఈ సినిమా తీశారు. ట్రైలర్ చాలా అద్బుతంగా ఉంది.

ఇక సినిమా లో డైలాగులు మనసుని మెలిపెట్టేలా ఉన్నాయి. కన్నకొడుకును ఎలాగైనా విమానం లో తీసుకెళ్లేందుకు రూ. 10 వేల కోసం తండ్రి ఉన్న సైకిల్ కూడా అమ్మే సీన్ అందరినీ కంటతడి పెట్టిస్తోంది. అటు అనసూయ, రాహుల్ రామకృష్ణ మధ్య సన్నివేషాలు కూడా అందరినీ ఎమోషనల్ గా కనెక్ట్ చేస్తున్నాయి. ట్రైలర్ తో మూవీ పై అంచనాలు భారీగా పెంచేశారు.

ఈ సినిమా ని జూన్ 9వ తేదీన ప్రేక్షకుల మందుకు తీసుకువస్తున్నారు. తండ్రి పాత్ర‌లో స‌ముద్ర ఖ‌ని, కొడుకు పాత్రలో మాస్టర్ ధ్రువన్ న‌టిస్తుండగా సుమ‌తి పాత్ర‌లో అన‌సూయ భ‌ర‌ద్వాజ్‌, రాజేంద్ర‌న్ పాత్ర‌లో రాజేంద్ర‌న్‌, డేనియ‌ల్ పాత్ర‌లో ధ‌న్‌రాజ్‌, కోటి పాత్ర‌లో రాహుల్ రామ‌కృష్ణ నటించారు.