'విక్రమ్' పుకార్లు నిజమే అయితే మరో విశ్వరూపమే

Tue Jul 20 2021 15:08:23 GMT+0530 (IST)

'Vikram' rumors are true but another cosmic one

యూనివర్శిల్ స్టార్ కమల్ హాసన్ ఇప్పటి వరకు ఎన్నో విలక్షణ పాత్రలు చేశారు. మరగుజ్జు వాడి పాత్ర నుండి పండు ముసలి వాడి పాత్ర వరకు ఎన్నో పాత్రలు చేసిన కమల్ హాసన్ ప్రస్తుతం తాను నటిస్తున్న 'విక్రమ్' సినిమాలో మరో విభిన్నమైన రోల్ లో కనిపించబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. తమిళ మీడియా వర్గాల నుండి అందుతున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం విక్రమ్ సినిమా కమల్ హాసన్ గుడ్డి వాడి పాత్రలో కనిపించబోతున్నాడట.ఇప్పటి వరకు ఆయన చేసిన సినిమాలకు ఈ సినిమాకు చాలా వ్యత్యాసం ఉంటుందని అంటున్నారు. దర్శకుడు లోకేష్ కనగరాజ్ ఈ సినిమాలో కమల్ నట విశ్వరూపంను చూపించబోతున్నాడనే వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే చాలా సినిమాల్లో కమల్ హాసన్ అద్బుతమైన నటనతో ఆకట్టుకున్నాడు. ఆయన నటన ఆస్కార్ అవార్డు లెవల్ లో ఉంటుందనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

కమల్ నటనకు మంచి కంటెంట్ యాడ్ అయితే అదో అద్బతంగా నిలుస్తుందని ఇప్పటికే వచ్చిన పలు సినిమాలతో నిరూపితం అయ్యింది. అందుకే ఈ సినిమా లో కమల్ అంధుడిగా నటించడం వల్ల ఖచ్చితంగా ఆయన నట విశ్వరూపం మళ్లీ అభిమానులు చూసే అవకాశం ఉంటుందని అభిమానులు మరియు మీడియా వర్గాల వారు నమ్మకంగా ఉన్నారు. విక్రమ్ సినిమాను పాన్ ఇండియా కంటెంట్ గా రూపొందిస్తున్నారు.

ఈ సినిమాలో తమిళ స్టార్ విజయ్ సేతుపతి మరియు మలయాళ లేటెస్ట్ సూపర్ స్టార్ ఫాహద్ ఫాజిల్ లు కీలక పాత్రల్లో నటించబోతున్నారు. వీరిద్దరు కూడా విలన్ గా నటిస్తే సినిమా రేంజ్ మరో లెవల్ లో ఉంటుందని ఇప్పటికే టాక్ వినిపిస్తుంది. ఇద్దరు సూపర్ విలన్ లు ఉండబోతున్న ఈ సినిమాలో హీరో గుడ్డి వాడు అంటే వినడానికే కాస్త విభిన్నంగా విచిత్రంగా ఉంది. కనుక ఇది ఖచ్చితంగా వర్కౌట్ అవుతుందని ఈ కాంబో ను చూసేందుకు అయినా ప్రేక్షకులు థియేటర్ల ముందు క్యూ కట్టడం ఖాయం అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు నమ్మకంగా చెబుతున్నారు.

గతంలో కమల్ హాసన్ ఒక సారి గుడ్డి వాడి పాత్రలో నటించాడు. కాని అప్పటి పరిస్థితులు ఇప్పటి పరిస్థితులు చాలా వేరు. కనుక ఈ సినిమాలో కమల్ గుడ్డి వాడిగా కనిపించేందుకు సిద్దం అవ్వడం చాలా పెద్ద నిర్ణయంగా మీడియా వర్గాల వారు అంటున్నారు. వందల కోట్లు పెట్టుబడి పెట్టే సినిమాలో హీరో గుడ్డి వాడు అయితే ప్రేక్షకుల స్పందన ఎలా ఉంటుందో అనే భయం నిర్మాతలకు ఉంటుంది. కాని కమల్ అక్కడ ఆ పాత్రను చేయబోతున్న కారణంగా నిర్మాత మాత్రమే కాకుండా ప్రేక్షకులు కూడా గుండెల మీద చేయి వేసుకుని హాయిగా సినిమా ఎంజాయ్ చేయవచ్చు అంటున్నారు.

ఈ సినిమా ను వచ్చే ఏడాదికి ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. దర్శకుడు లోకేష్ కనగరాజ్ ఖైదీ మరియు మాస్టర్ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ లను దక్కించుకున్న కారణంగా విక్రమ్ కూడా ఆయనకు మరో విజయాన్ని కట్టబెట్టడం ఖాయం అంటూ మీడియా వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.