విక్రమ్ ఓటీటీ డేట్ వచ్చేసింది.. చూసుకుందాం పదండి

Wed Jun 29 2022 12:06:11 GMT+0530 (IST)

Vikram OTT date has arrived

ఎంతో కాలంగా సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న కమల్ హాసన్ కు మొత్తానికి విక్రమ్ సినిమాతో భారీ విజయం దక్కింది. లోకేష్ కనగరాజు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి కలెక్షన్స్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ముఖ్యంగా తమిళనాడులో అయితే ఎంతో కాలంగా ఉన్న బాహుబలి 2 రికార్డును కూడా బ్రేక్ చేసింది. ప్రపంచ వ్యాప్తంగా అత్యధికంగా కలెక్షన్స్ అందుకున్న తమిళ సినిమాల్లో ఒకటిగా నిలిచింది.విశ్వనటుడు కమల్ హాసన్ ఈ సినిమా విజయంతో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ప్రత్యేకంగా చిత్ర యూనిట్ సభ్యులందరికీ కూడా ఏదో ఒక కానుక ఇస్తూనే వచ్చాడు.
ఇక ఈ సినిమాను ఓటీటీలో ఎప్పుడు వస్తుందా మరోసారి ఎప్పుడు చూస్తామా అని ఓ వర్గం ప్రేక్షకులు కూడా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. ఇదివరకే డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో విడుదల చేయనున్నట్లుగా అఫీషియల్గా ఒక క్లారిటీ అయితే వచ్చేసింది.

ఇక ఇప్పుడు రీసెంట్ గా మరొకసారి ఒక పవర్ఫుల్ వీడియో తో ఎప్పుడు వస్తుంది అనే విషయంలో క్లారిటీ ఇచ్చేశారు. జూలై 8 వ తేదీన డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఒకేసారి  తెలుగు తమిళ్ మలయాళం కన్నడ హిందీ భాషల్లో విక్రమ్ సినిమా స్ట్రీమింగ్ కానుంది.

తప్పకుండా ఈ సినిమా కు ఓటీటీ లో కూడా భారీ స్థాయిలో స్పందన లభిస్తుంది అని చెప్పవచ్చు. ఇక బాక్సాఫీస్ వద్ద విక్రమ్ సినిమా దాదాపు 400 కోట్లకు పైగా కలెక్ట్ చేసినట్లు సమాచారం.

ప్రపంచవ్యాప్తంగా మొదటిసారి కమలహాసన్ 200 కోట్లు దాటి ఏకంగా అంతకంటే డబుల్ నెంబర్లను సొంతం చేసుకోవడం విశేషం. ఇక ఈ సినిమా సక్సెస్ అయిన ఆనందం లో డైరెక్టర్ కు ఖరీదైన కారును బహుమతిగా ఇచ్చిన విషయం తెలిసిందే.

అలాగే ప్రత్యేకమైన పాత్రలో నటించిన సూర్యకు కూడా ఖరీదైన రోలెక్స్ వాచ్ ను ఇచ్చాడు. అంతే కాకుండా విక్రమ్ సినిమాకు పనిచేసిన లైట్ మ్యాన్ దగ్గర నుంచి స్వీపర్స్ వరకు అందరికీ కూడా ప్రత్యేకంగా భోజనాలు కూడా పెట్టించారు.