గుర్తించలేని రీతిలో రిస్కీ హీరో.. నయా లుక్!

Mon Jun 14 2021 20:00:02 GMT+0530 (IST)

Vikram New Look

దక్షిణాది స్టార్ హీరోలలో ఒకరు విక్రమ్.. సినీ అభిమానులకు విక్రమ్ పేరు అసలు పరిచయం అవసరం లేదు. ఎందుకంటే కెరీర్ ప్రారంభం నుండి తన విలక్షణ నటనతో విక్రమ్ అభిమానులను అలరిస్తున్నాడు. సినిమా కోసం ఎంత రిస్క్ అయినా చేసే హీరోలలో విక్రమ్ ఎల్లప్పుడూ ముందే ఉంటాడు. సినిమా హిట్ అయ్యిందా ఫ్లాప్ అయ్యిందా అనే సంబంధం లేకుండా తనని తాను క్యారెక్టర్ కోసం మలుచుకుంటాడు. ఆ విధంగానే గతంలో ‘అపరిచితుడు’ ‘ఐ’ ‘ఇంకొక్కడు’ ఇలా తన కెరీర్‌లో ఎన్నో గుర్తుండిపోయే క్యారెక్టర్స్ చేశాడు. పాత్రకోసం విక్రమ్ రిస్క్ చేయడం ఇదేం కొత్త కాదు.ప్రస్తుతం ఈ స్టార్ హీరో కోబ్రా అనే సినిమాలో నటిస్తున్నాడు. తమిళ దర్శకుడు అజయ్ జ్ఞానముత్తు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే ఇటీవలే కోబ్రా టీజర్ విడుదలై సూపర్ రెస్పాన్స్ దక్కించుకుంటుంది. ఈ నేపథ్యంలో సినిమా టీజర్ లో కనిపించిన క్యారెక్టర్స్ గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చలు నడుస్తున్నాయి. విక్రమ్ టోటల్ గా ఈ సినిమాలో ఏడు క్యారెక్టర్స్ పోషిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే అందులో ప్రతి క్యారెక్టర్ ఎంతో డిఫరెంట్ గా ఉంది. అలాగే కొన్నింట్లో అసలు విక్రమే నటించాడా క్యారెక్టర్ లో అనేవిధంగా సర్ప్రైజ్ చేసాడు.

ఆల్రెడీ ఓ ఇంటర్వ్యూలో దర్శకుడు అజయ్ ఈ సినిమా గురించి కొన్ని సంచలన విషయాలు బయటపెట్టాడు. ఒక సన్నివేశం కోసం విక్రమ్ తన ప్రాణాలనే రిస్క్ లో పెట్టాడని తెలిపాడు. ఓ సన్నివేశంలో హీరో చేతులు కాళ్ళు కట్టేసి ఉంటాయి. అలాగే నోటికి కూడా గుడ్డ కట్టి ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో కాళ్ళని పైన కట్టేసి ఉండగా తల్లకిందులుగా నీటిలో ముంచుతారు. అలా కొంత సమయం నీటిలోనే ఉండాలి. ముందుగా ఈ సన్నివేశాన్ని డూప్ తో చేయించాలని ప్లాన్ చేసుకున్నాం. కానీ డూప్ కొన్ని సెకండ్ల కంటే ఎక్కువ సమయం భరించలేకపోయాడు. కానీ సీన్ పై విక్రమ్ సంతృప్తిగా లేడు. డూప్ అవసరం లేకుండా తానే స్వయంగా ఆ సీన్ చేసాడు. ఆ విధంగా రిస్క్ చేసాడు.

ఇదిలా ఉండగా.. తాజాగా విక్రమ్ వైట్ మీసాలతో బ్లాక్ గడ్డం కలిగి ఉన్నటువంటి ఓ న్యూ లుక్ హల్చల్ చేస్తోంది. ఖచ్చితంగా ఆ లుక్ ఎవరు చూసినా విక్రమ్ అని గుర్తించడం కష్టం. అలా కనిపిస్తున్నాడు విక్రమ్. మరి విక్రమ్ డెడికేషన్ ఆ లెవెల్లో ఉంటుందనే విషయం తెలిసిందే. మేకప్ విషయంలో కూడా ఎంతో జాగ్రత్తగా ఉంటాడు. ప్రస్తుతం విక్రమ్ డెడికేషన్ లెవెల్స్ గురించి సోషల్ మీడియాలో ప్రశంసలు కురుస్తున్నాయి. ఈ సినిమాలో మాజీ క్రికెట్ ప్లేయర్ ఇర్ఫాన్ పఠాన్ ఇంటర్పోల్ ఆఫీసర్ గా నటిస్తుండగా.. శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా కనిపించనుంది. ఏఆర్ రెహమాన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ప్రస్తుతం సినిమా గురించి ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. చూడాలి మరి విక్రమ్ కష్టానికి హిట్ వస్తుందేమో!