Begin typing your search above and press return to search.

వందేళ్ల సినీ చరిత్రలో 'విక్రమ్‌' రికార్డ్‌

By:  Tupaki Desk   |   23 Sep 2022 7:17 AM GMT
వందేళ్ల సినీ చరిత్రలో విక్రమ్‌ రికార్డ్‌
X
యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కి ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన విక్రమ్‌ సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. విడుదల అయిన ప్రతి చోట కూడా సినిమాకు మంచి వసూళ్లు నమోదు అయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో భారీగా వసూళ్లను సొంతం చేసుకున్న విక్రమ్‌ ఉత్తర భారతంలో హిందీ సినిమాల రేంజ్ లో సినిమాలో వసూళ్లను సొంతం చేసుకుంది.

ఇక ఓవర్సీస్ లో రెండు మిలియన్ల వసూళ్లకు పైగానే రాబట్టింది. ఇక తమిళనాట ఓ రేంజ్ లో వసూళ్లను ఈ సినిమా దక్కించుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 500 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు చేసినట్లుగా అధికారికంగా ప్రకటన వచ్చింది. ఈ సినిమా ఇప్పటికే తమిళ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. సుదీర్ఘ కాలం తర్వాత కమల్‌ ఈ సినిమా తో సంచలనం సృష్టించాడు.

ఈ సినిమా థియేట్రికల్‌ రన్ నిన్నటి తో ముగిసింది. నిన్నటి వరకు కూడా కోయంబత్తూర్ కేజీ సినిమాస్ లో ఆడింది. ఎట్టకేలకు అక్కడ నుండి కూడా తొలగించారు. దాంతో ఈ సినిమా థియేట్రికల్‌ రన్‌ ముగిసింది. ఈ సినిమా తాజాగా ఓటీటీ లో కూడా స్ట్రీమింగ్‌ అవుతున్న విషయం తెల్సిందే. ఈ సినిమాకు సంబంధించిన మరో రికార్డు ప్రస్తుతం తమిళనాట చర్చనీయాంశంగా మారింది.

వందేళ్ల తమిళ సినీ చరిత్రలో ఇప్పటి వరకు ఏ సినిమాకు రానంత మంది ఈ సినిమా కోసం థియేటర్లకు వచ్చారట. ఇది ఒక గొప్ప రికార్డ్‌ గా తమిళ సినీ ప్రేమికులు మరియు కమల్‌ అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కరోనా తర్వాత సినిమా ఇండస్ట్రీ ఏమవుతుందో అనుకుంటున్న సమయంలో అనూహ్యంగా విక్రమ్‌ ఈ రికార్డును దక్కించుకోవడం ప్రతి ఒక్కరికి ఊరట కలిగిస్తుంది.

తమిళనాట ఆల్ టైమ్‌ రికార్డు నమోదు చేసిన విక్రమ్‌ సినిమా అత్యధిక గ్రాస్ వసూళ్లు సాధించిన సినిమా గా.. అత్యధిక షేర్‌ వసూళ్లు నమోదు చేసిన సినిమాగా... అత్యధిక మంది చూసిన సినిమా గా రికార్డును దక్కించుకుంది అంటూ ప్రముఖ బాక్సాఫీస్‌ విశ్లేషకుడు రమేష్ బాలా పేర్కొన్నారు.

సినిమా రికార్డుల పరంపర తో కమల్ తదుపరి సినిమాలపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇండియన్ 2 తో ఆయన వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.