టీజర్ టాక్: మెగా అల్లుడు ఇంప్రెస్ చేశాడు

Tue Jun 12 2018 10:26:48 GMT+0530 (IST)

Vijetha Teaser

మెగా స్టార్ చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా మెగా అభిమానుల ముందుకు రావడానికి చాలా ఉత్సాహాన్ని చూపుతున్నాడని అర్ధమవుతోంది. మెగా కాంపౌండ్ అంటే ఆ సపోర్ట్ గట్టిగా ఉంటుంది. కానీ అల్లుడు గారు మాత్రం సోలో గా రావడానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారు. విజేత సినిమా మొదలైనప్పటి నుంచి మెగా ఫ్యామిలీ ఎక్కువగా హంగు ఆర్భాటాలు లేకుండా చూసుకుంటోంది. సొంతంగా దేవ్ తన కెరీర్ లో సెట్ అవ్వాలని  కోరుకుంటున్నారు.ఆ సంగతి అటుంచితే ఈ మధ్య పోస్టర్లతో అందరిని ఆకట్టుకున్న కళ్యాణ్ టీజర్ తో మరోసారి  స్పెషల్ గా ఎట్రాక్ట్ చేశాడు. ముందుగా చెప్పినట్లే విజేత  సినిమా ఫాదర్ అండ్ సన్ సెంటిమెంట్ తో స్ట్రాంగ్ ఉంటుందని నిరూపించారు. టీజర్ లో ఆ వాతావరణం ఒక నిమిషంలో కనిపించింది మనస్సుకు నచ్చిన చేసుకుంటూ బ్రతకడం అందరికి సాధ్యం కాదు నాన్న.. లైఫ్ లో కొంచెం కాంప్రమైజ్ అయ్యి బ్రతకాలి అనే మాటతో మురళి శర్మ సినిమా అర్ధాన్ని చెప్పేశారు.

చలాకీగా తిరిగే కుర్రాడు బాధ్యతతో పెంచాలనుకునే తండ్రి మధ్య సున్నితమైన అంశాలతో దర్శకుడు రాకేష్ శశి అద్భుతంగా తెరకెక్కించడానికి ప్రయత్నించారని చెప్పవచ్చు. ఇక హీరోయిన్ మాళవిక శర్మ ఈ కథలో సింపుల్ అండ్ బ్యూటిఫుల్ లుక్ తో ఆకర్షిస్తోంది. సినిమా తప్పకుండా ఓ వర్గం వారిని ఆకట్టుకుంటుందని చెప్పవచ్చు. కథానాయకుడు కళ్యాణ్ కథను బట్టి మొదటి సినిమాలో మంచి లుక్ తో కనిపిస్తున్నాడు. అలాగే ఇంప్రెస్ చేశాడు కూడా. మరి ఈ సినిమా రిలీజ్ తరువాత ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.