జీవిత చక్రంలో తిరిగి అక్కడికే రావాలి!- మహేష్

Thu Sep 12 2019 21:55:40 GMT+0530 (IST)

Vijayshanti On About His Mahesh Babu

``జీవితం బొంగరం లాంటిది. తిరిగి తిరిగి ఎక్కడ మొదలైందో అక్కడికే రావాలి`` .. ఇది ప్రతి ఒక్కరికి ఎదురయ్యే అనుభవం. ఏదో ఒక సందర్భంలో ఇలాంటి సన్నివేశం ఎదురవుతుంది. సూపర్ స్టార్ మహేష్ కి అలాంటి సందర్భమే ఎదురైంది మరి. తాజాగా తనకు ఎదురైన ఆ అనుభవం గురించి మహేష్ అభిమానులకు రివీల్ చేశారు.``జీవితం అనే వృత్తంలో ఎటు తిరిగినా మళ్లీ అక్కడికే రావాలి. 30 ఏళ్ల క్రితం నేను తనతో కలిసి నటించాను. మళ్లీ ఇన్నాళ్టికి కలిసి నటిస్తున్నాం. 1989లో కొడుకు దిద్దిన కాపురం చిత్రంలో కలిసి నటించాం`` అని గుర్తు చేసుకున్నారు మహేష్. సూపర్ స్టార్ కృష్ణ- విజయశాంతి జంటగా నటించిన `కొడుకు దిద్దిన కాపురం` చిత్రంలో మహేష్ బాబు కీలక పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. అప్పటికి పాల బుగ్గల బాలకుడిగా కనిపించేవారు మహేష్. నూనూగు మీసాలు ఇంకా రాలేదు అప్పటికి. అందుకే ఆ జ్ఞాపకాల్ని ఎంతో ఎమోషనల్ గా షేర్ చేసుకున్నారు ఇప్పుడు. కొడుకు దిద్దిన కాపురం అప్పట్లో ఫ్యామిలీ ఆడియెన్ ని మెప్పించింది. విజయశాంతితో మహేష్ సెంటిమెంట్ సీన్స్ కుటుంబ ఆడియెన్ కి గొప్పగా కనెక్టయ్యాయి.

మహేష్ నటిస్తున్న 26వ చిత్రం `సరిలేరు నీకెవ్వరు`లో విజయశాంతి నటిస్తున్న విషయం తెలిసిందే. దాదాపు 13ఏళ్ల తర్వాత తనకు కంబ్యాక్ మూవీ ఇది. తెలిసిన విషయమే అయినా మరోసారి మహేష్ గుర్తు చేశారిలా. ఈ ట్వీట్లతో నెమ్మదిగా సినిమాకి హైప్ పెంచుతున్నారు. ఇందులో మహేష్ ఆర్మీ అధికారిగా నటిస్తుండగా.. విజయశాంతి కాలేజ్ లెక్చరర్ గా నటిస్తున్నారని ఇటీవల వెల్లడైంది. మహేష్- విజయశాంతి మధ్య స్టన్నింగ్ అనిపించే సన్నివేశాల్ని అనీల్ రావిపూడి తెరకెక్కించారని తెలుస్తోంది. ఈ క్రేజీ చిత్రం 2020 సంక్రాంతికి రిలీజ్ కానుంది.