2.0 రచయిత నవల.. జాతీయ అవార్డ్ దర్శకుడితో సేతుపతి వీరవిహారం

Fri Mar 31 2023 09:29:54 GMT+0530 (India Standard Time)

VijaySethupathi in Vetrimaaran Viduthalai Film

తమిళం లో రా అండ్ రస్టిక్ సినిమాలతో వేట్రిమారన్ తనదైన ప్రత్యేకతను చాటుకున్న సంగతి తెలిసిందే. ఆడుకలం చిత్రంతో ఉత్తమ జాతీయ దర్శకుడిగా సంచలనం సృష్టించాడు. కాకా ముట్టై-విసరరణై-అసురన్ లాంటి చిత్రాలతోను పలు కేటగిరీల్లో జాతీయ అవార్డులు కొల్లగొట్టిన ప్రతిభావంతుడు. అతడు తెరకెక్కిస్తున్న తాజా చిత్రం 'విడుతలై' ఇప్పుడు ఎక్కువగా చర్చనీయాంశంగా మారింది. ఇది మరో రా అండ్ రస్టిక్ మూవీ. పాత్రలన్నీ రఫ్ గా తెరపై వినోదాన్ని పంచనున్నాయని సమాచారం.



అలాగే తమిళంలో ప్రొడక్షన్ కి ఎక్కువ సమయం తీసుకున్న ప్రాజెక్ట్ లలో 'విడుతలై' ఒకటి. ఈ చిత్రం రెండు భాగాలుగా రూపొందించారని సమాచారం. ఈ సిరీస్ లోని మొదటి భాగం మార్చి 31న విడుదల కానుంది. ఈ చిత్రం సెన్సార్ బోర్డు నుండి A సర్టిఫికెట్ ని దక్కించుకుంది. ప్రతి సన్నివేశంలో ఏదో ఒక ఆసక్తికరమైన టింజ్ ట్విస్ట్ తో అభిమానుల హృదయాలను కొల్లగొట్టడానికి 'విడుతలై పార్ట్ 1' వస్తోందని.. మరోసారి వేట్రి మారన్ మార్క్ మ్యాజిక్ ని తెరపై చూస్తారని తమిళ పరిశ్రమలో టాక్ వినిపిస్తోంది.

ఇప్పుడు తమిళ సినీవిశ్లేషకుల దృష్టి ఈ సినిమాపైనే ఉంది. విడుతలై పార్ట్ 1 చిత్రాన్ని పెద్ద స్క్రీన్ లపై చూడటానికి ముఖ్య కారణాల్లో ప్రధానమైనది ఈ చిత్రంలో విజయ్ సేతుపతి నటవిశ్వరూపం ప్రదర్శించడమేనని కూడా టాక్ వినిపిస్తోంది.

వెట్రి మారన్ నుంచి మరో రా అండ్ రగ్గ్ డ్ కంటెంట్ ఉన్న సినిమా ఇది. అతడు నిజానికి చిత్రనిర్మాణంలో ఒక ప్రత్యేకమైన శైలిని అనుసరిస్తాడు. కెరీర్ లో ఎక్కువగా నవలల ఆధారంగా సినిమాలు చేయడానికి ఇష్టపడతాడు. 'విదుతలై' ప్రముఖ జర్నలిస్ట్.. సినీరచయిత జేయమోహన్ (రజనీ 2.0 రచయిత) రాసిన 'తునైవన్' నవల ఆధారంగా రూపొందించారు. ఈ చిత్రం ఒక యువ పోలీసు చిత్తశుద్ధి గురించిన స్టోరి. వెట్రి మారన్ తన డ్రీమ్ ప్రాజెక్ట్ పై మరింత ఫోకస్ చేసాడు. ప్రతిభావంతుడైన దర్శకుడి నుండి ఇది రా (ముడి) కంటెంట్ మూవీ గా అలరించనుంది.

తమిళ సినిమాలలో తన హాస్య పాత్రల ద్వారా అభిమానులను ఆకట్టుకున్న సూరి 'విడుతలై'తో మొదటిసారి హీరోగా ప్రయత్నించాడు. ఈ చిత్రంలో అతను పోలీసుగా నటించాడు. హీరోయిజం కంటే సూరి పాత్ర సినిమా కథతో పాటు కదిలిపోతుంది. ఆద్యంతం ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుందని వేట్రి చెబుతున్నారు. ప్రతిభావంతుడైన సూరి ఈ చిత్రంలో తన పాత్ర కోసం ఎంతో శ్రమించాడు. అతడు కొన్ని ప్రమాదకర విన్యాసాలు కూడా చేశాడని వెల్లడించారు.

ఇక ఇందులో విజయ్ సేతుపతి ఛాలెంజింగ్ రోల్ లో నటించాడు. విక్రమ్ తర్వాత అతడి మార్క్ ఏంటో మరోసారి ఈ సినిమాలో చూడబోతున్నారని వేట్రి అంటున్నారు. ఈ చిత్రంలో సేతుపి ప్రధాన విలన్ గా కనిపించబోతున్నాడు. అతని పాత్ర ప్రధాన పాత్రకు సమానంగా పవర్ ఫుల్ గా రూపొందించడంతో షో స్టాపర్ గా నిలుస్తాడు. విజయ్ సేతుపతి 'విడుతలై'లో గ్యాంగ్ లీడర్ గా అలరించబోతున్నాడని దర్శకుడు వేట్రి ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.