సూపర్ స్టార్ సినిమాకు నష్టాలంటూ మీడియా కథనంపై నిర్మాత క్లారిటీ

Fri May 29 2020 10:15:44 GMT+0530 (IST)

Vijay starrer Bigil incurred 20 crore loss

తమిళ సూపర్ స్టార్ విజయ్ హీరోగా తెరకెక్కి గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన బిగిల్ చిత్రం ఎప్పుడు ఏదో ఒక విషయంలో మీడియాలోనే ఉంటూ వస్తోంది. ఆమద్య ఇన్ కమ్ ట్యాక్స్ రైడ్స్ తో చాలా రోజులు మీడియాలో ఉన్న ఈ చిత్రం ఇప్పుడు మరోసారి మీడియాలోకి వచ్చింది. ప్రముఖ జాతీయ మీడియా సంస్థ ఈ సినిమాకు 20 కోట్లు నష్టం వచ్చినట్లుగా కథనంను ప్రసారం చేసింది. ఆ విషయంను సహ నిర్మాత అయిన అర్చన కల్పతి తమకు చెప్పింది అంటూ కథనంలో పేర్కొన్నారు.సదరు మీడియా సంస్థ కథనంపై విజయ్ అభిమానులు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. వెంటనే ఆ కథనంపై అర్చన కల్పతి స్పందించాలంటూ విజయ్ ఫ్యాన్స్ విజ్ఞప్తి చేశారు. ఈ విషయమై అర్చన కల్పతి స్పందించింది. తమ సినిమాకు నష్టాలు వచ్చినట్లుగా నేను ఏ ఒక్క ఇంటర్వ్యూలో కూడా చెప్పలేదు. ఏదైనా విషయమై కథనం ప్రసారం చేసే సమయంలో పూర్తి వివరాలు తెలుసుకోవాలంటూ సదరు మీడియా సంస్థకు ఘాటుగా ట్వీట్ చేసింది.

బిగిల్ చిత్రం దాదాపుగా 180 కోట్లతో తెరకెక్కింది. అన్ని భాషల్లో కలిపి 300 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు నమోదు అయ్యాయి అంటూ తమిళ మీడియాలో కథనాలు వచ్చాయి. కాని అదంతా కూడా ఉత్తి ప్రచారమే 20 కోట్ల నష్టం అంటూ జాతీయ మీడియా కథనంలో పేర్కొంది. నిర్మాత అర్చన కల్పతి నష్టాలు ఏమీ రాలేదంటూ ప్రకటించడంతో విజయ్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఆ జాతీయ మీడియాకు వ్యతిరేకంగా ట్వీట్స్ చేస్తున్నారు.