ఇండస్ట్రీలో రాజకీయాలు డ్రామాలు చాలా ఉంటాయి: VD

Fri Aug 05 2022 18:00:01 GMT+0530 (India Standard Time)

Vijay devarakonda hot comments

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ యూత్ లో తనకంటూ ప్రత్యేకమైన ఫాలోయింగ్ ను సంపాదించుకున్నాడు. సినిమాలతోనే కాకుండా రియల్ లైఫ్ యాటిట్యూడ్ తోనూ వీడీ బాగా పాపులర్ అయ్యాడని చెప్పాలి. 'పెళ్లి చూపులు' సినిమాతో హీరోగా మారిన విజయ్.. 'అర్జున్ రెడ్డి' చిత్రంతో సెన్సేషన్ క్రియేట్ చేసాడు. ఇప్పుడు 'లైగర్' మూవీతో పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటడానికి రెడీ అయ్యాడు.ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన విజయ్'D.. తన టాలెంట్ తో ఇప్పుడు సెల్ఫ్ మేడ్ స్టార్ గా కొనియాడబడుతున్నాడు. ఇప్పుడు 'లైగర్' సినిమా సక్సెస్ అయితే పాన్ ఇండియా స్టార్ గా అవతరించే అవకాశం ఉంది. అయితే ఇటీవల ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో అతని కామెంట్స్ పరోక్షంగా ఇండస్ట్రీలో నెపోటిజంపై చేసినవే అని నెట్టింట చర్చలు జరిగిన సంగతి తెలిసిందే.
 
'నా అయ్య తెల్వదు.. మా తాత ఎవడో తెల్వదు..' అంటూ VD చేసిన వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. తాతలు తండ్రుల పేరు చెప్పుకుని స్టార్ డమ్ తెచ్చుకున్న హీరోలను దృష్టిలో పెట్టుకునే అతను ఇలాంటి కామెంట్స్ చేశారని నెటిజన్లు ట్రోల్ చేశారు. బండ్ల గణేష్ లాంటి సినీ ప్రముఖులు ఇన్ డైరెక్టర్ గా కౌంటర్ కూడా ఇచ్చారు.

అయినా సరే ఏమాత్రం వెనక్కి తగ్గని #AyyaThathaEvadTelvadhu అనే హ్యాష్ ట్యాగ్ తో ట్వీట్ చేయడం హాట్ టాపిక్ అయింది విజయ్. ఈ క్రమంలో 'లైగర్' ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఎఫ్ఎమ్ రేడియో ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఇండస్ట్రీలో చాలా రాజకీయాలు నడుస్తాయని కీలక వ్యాఖ్యలు చేశారు.

'లైగర్' సినిమాకు దూకుడుగా ప్రమోషన్స్ చేయడం గురించి VD మాట్లాడుతూ.. కోవిడ్ వల్ల ఇబ్బందులు తలెత్తాయి.. అలానే చెప్పలేని చాలా ఇన్సిడెంట్స్ జరిగాయి. మూవీపై ఎఫెక్ట్ పడేలా చేయాలని కొందరు చాలా ట్రై చేశారు. ఇండస్ట్రీలో ఇలాంటి డ్రామాలు పాలిటిక్స్ చాలా ఉంటాయి. ఎక్కడికెళ్లినా ఈ డ్రామాలు ఉంటాయి. వాళ్లందరికీ వాట్ లాగా దేంగే అనే స్పిరిట్ తో ఈ సినిమా చేశా'' అని అన్నారు.

ఇదిలా ఉంటే ఇటీవల 'కాఫీ విత్ కరణ్' టాక్ షోలో నెపోటిజంపై విజయ్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. 'ఇండస్ట్రీతో సంబంధం లేని వ్యక్తి పైకి రావడం అంత ఈజీ కాదు. అది ఎంతో కష్టంతో కూడుకున్న విషయం. అందరూ ఒకే ఆర్థిక స్థోమత అంతస్థులతో పుట్టరు. అందరికీ ఒకేలాంటి ఎత్తు కలర్ అందం ఉండదు. అసలు ఈ ప్రపంపచమే న్యాయంగా లేదు అనిపిస్తోంది' అని తెలిపారు.

'నేను ఎప్పుడూ బాగా డబ్బున్న వారి పిల్లలు లేదా స్టార్ కిడ్స్ ని చూసి అసూయపడలేదు. వాళ్లను నేను బ్లేమ్ చేయను కూడా. స్టార్ కిడ్ గా పుట్టడం వాళ్ల తప్పు కాదు. రేపు నాకు పిల్లలు పుడతారు. ఒక నటుడి కొడుకుగా పుట్టడం వాడి తప్పు కాదు. ప్రపంచం ఎవరితోనూ న్యాయంగా ఉండదు. ఎక్కడా సమానత్వం లేదు. ఇక్కడ నిలదొక్కుకోవాలంటే నీ కష్టం నువ్వు పడాల్సిందే. కాకపోతే స్టార్ కిడ్స్ గా పుట్టినందుకు కొన్ని బెనిఫిట్స్ కూడా ఉంటాయి. కానీ నా జీవితంలో జరిగినవేవీ నేను మార్చలేను. నేను ఎదుర్కొన్న ప్రతి అవమానం.. పడిన కష్టాలు మరియు నాకు ఎదురైన అడ్డంకులకు నేను కృతజ్ఞుడను. ప్రపంచమంతా నాతో న్యాయంగా ఉండాలని నేను ఆశించను' అని విజయ్ దేవరకొండ చెప్పుకొచ్చారు.

ఇక 'లైగర్' విషయానికొస్తే.. ఆగస్ట్ 25న వరల్డ్ వైడ్ గా థియేటర్లలోకి రాబోతోంది. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కింది. ఇది దర్శక హీరోలకు ఫస్ట్ పాన్ ఇండియా మూవీ. తెలుగు తమిళ మలయాళ మలయాళ కన్నడ హిందీ భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది.